సినిమాTejaswini Dance Video | నందమూరి అభిమానులను ఫిదా చేస్తున్న తేజస్విని.. డ్యాన్స్ వీడియోతో సోషల్...

Tejaswini Dance Video | నందమూరి అభిమానులను ఫిదా చేస్తున్న తేజస్విని.. డ్యాన్స్ వీడియోతో సోషల్ మీడియాలో సెన్సేషన్!

నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని మరోసారి వార్తల్లో నిలిచారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్: Tejaswini Dance Video | తెలుగు చిత్రసీమలో నందమూరి కుటుంబానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. స్వర్గీయ ఎన్టీఆర్ వారసత్వాన్ని నందమూరి బాలకృష్ణ, కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR) విజయవంతంగా కొనసాగిస్తున్నారు. అయితే ఈ కుటుంబానికి చెందిన మహిళలు సాధారణంగా మీడియా, సినిమా రంగాలకు కాస్త దూరంగానే ఉంటారు.

అలాంటి వారిలో బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని కూడా ఒకరు. ఇటీవల కాలంలో మాత్రం తేజస్విని సోషల్ మీడియా (Social Media)లో యాక్టివ్‌గా ఉంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటున్నారు. ముఖ్యంగా ఆమె చేసిన తాజా డ్యాన్స్ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ప్రముఖ కొరియోగ్రాఫర్ భాను మాస్టర్‌తో కలిసి ఆమె వేసిన స్టెప్పులు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

Tejaswini Dance Video | సోష‌ల్ మీడియాలో ప్ర‌శంస‌లు..

Tejaswini Dance Video

ఎప్పుడూ సింపుల్, ఎలిగెంట్ లుక్‌లో కనిపించే తేజస్విని.. ఈసారి పూర్తి భిన్నంగా కనిపించారు. పాట బీట్‌కు తగ్గట్టుగా ఆమె చూపించిన గ్రేస్, ఎనర్జీ, ఎక్స్‌ప్రెషన్స్ చూసి నందమూరి అభిమానులు ఫిదా అవుతున్నారు. “తండ్రి బాలయ్యలా అద్భుతమైన టైమింగ్ ఉంది”, “నందమూరి రక్తంలోనే డ్యాన్స్ ఉంది” అంటూ సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. వ్యక్తిగత జీవితంలో తేజస్విని ప్రముఖ విద్యాసంస్థల అధినేత, విశాఖపట్నం ఎంపీ మతుకుమిల్లి శ్రీభరత్‌ని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఆర్యవీర్ అనే కుమారుడు ఉన్నాడు. కుటుంబ బాధ్యతలతో పాటు వ్యాపార వ్యవహారాల్లో కూడా ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారు.

Tejaswini Dance Video | జ్యువెలరీ బ్రాండ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా

సినిమాల్లో నటించకపోయినా, సినీ రంగానికి తేజస్విని చాలా దగ్గరగా ఉంటారు. తండ్రి బాలకృష్ణ (Balakrishna) నటించిన కొన్ని చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేయడంతో పాటు, ప్రముఖ టాక్ షో అన్‌స్టాపబుల్ విజయవంతం కావడంలో ఆమె కీలక పాత్ర పోషించినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఆ షోకు క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా, కన్సల్టెంట్‌గా వ్యవహరించిన ఆమె తన ప్రతిభను చాటుకున్నారు.

 Tejaswini Dance Video

ఇక ఇటీవల తేజస్విని గ్లామర్ ప్రపంచంలోకి కూడా అడుగుపెట్టారు. ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ ఓ కమర్షియల్ యాడ్‌లో నటించారు. ఆ ప్రకటనలో ఆమె స్క్రీన్ ప్రెజెన్స్‌కు మంచి స్పందన లభించింది. ఇప్పుడు డ్యాన్స్ వీడియోతో మరోసారి వార్తల్లో నిలిచిన తేజస్విని.. నటన, క్రియేటివ్ పనులు, వ్యాపార రంగం, సోషల్ మీడియా వంటి విభిన్న రంగాల్లో తన ప్రతిభను నిరూపించుకుంటున్నారు. భవిష్యత్తులో ఆమె వెండితెరపై కనిపించినా ఆశ్చర్యపోనక్కర్లేదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

ఇది కూడా చదవండి..: Peddi Trolling | ‘పెద్ది’పై నెగిటివ్ ట్రోలింగ్.. పోలీసులకు చిత్ర యూనిట్ ఫిర్యాదు

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Emergency Landing | శంషాబాద్‌లో విమానం అత్యవసర ల్యాండింగ్

అక్షరటుడే, వెబ్​డెస్క్: Emergency Landing | శంషాబాద్‌ (Shamshabad)లో శనివారం ఉదయం...

Kishan Reddy Criticism | ధాన్యం సేకరణ ప్రక్రియ దారుణంగా తయారైంది:కిషన్‌రెడ్డి

అక్షరటుడే వెబ్‌డెస్క్: Kishan Reddy Criticism | తెలంగాణలో ధాన్యం సేకరణ...

Ajith Mother Passed Away | కోలీవుడ్‌లో విషాదం.. అజిత్ కుమార్‌కు మాతృవియోగం

అక్షరటుడే, వెబ్​డెస్క్: Ajith Mother Passed Away | తమిళ చిత్ర...

Murugan Temple | మంత్రిని లంచం అడిగిన అర్చకులు.. ఎక్కడో తెలుసా?

అక్షరటుడే, వెబ్​డెస్క్: Murugan Temple | దేశంలో బడి నుంచి గుడి...