Spider Man Brand New Day | బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే..రెండు రోజుల్లో రూ.100 కోట్ల నెట్ మార్క్ దాటిన భారత మార్కెట్​

కేవలం రెండు రోజుల్లోనే భారత్‌లో ఈ సినిమా రూ.109.95 కోట్ల నెట్, సుమారు రూ.131.46 కోట్ల గ్రాస్ వసూళ్లను అందుకున్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Spider Man Brand New Day | మార్వెల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ విడుదలైన తొలి రెండు రోజుల్లోనే భారత బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లతో దూసుకెళ్తోంది. టామ్ హాలండ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం భారీ ఓపెనింగ్‌ను నమోదు చేసి, హాలీవుడ్ చిత్రాల వసూళ్లలో కొత్త రికార్డులు సృష్టించే దిశగా సాగుతోంది.

Spider Man Brand New Day | తొలి రోజే రూ.60.60 కోట్ల కలెక్షన్లు

విడుదలైన తొలి రోజే దేశవ్యాప్తంగా సుమారు రూ.60.60 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించిన ఈ చిత్రం, రెండో రోజూ అదే జోరును కొనసాగించింది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం, రెండో రోజు సుమారు రూ.49.35 కోట్ల నెట్ వసూళ్లు నమోదు చేసింది.

దీంతో కేవలం రెండు రోజుల్లోనే భారత్‌ Bharat లో ఈ సినిమా రూ.109.95 కోట్ల నెట్, సుమారు రూ.131.46 కోట్ల గ్రాస్ వసూళ్లను అందుకున్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. తొలి రోజు గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద సుమారు 167 నుంచి 173 మిలియన్ అమెరికన్ డాలర్ల వసూళ్లు సాధించినట్లు అంతర్జాతీయ ట్రేడ్ అంచనాలు సూచిస్తున్నాయి.

Allu Arjun Comments | ఫ్యాన్స్ మీట్‌లో అల్లు అర్జున్ సంచలన వ్యాఖ్యలు.. సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న విమర్శలు

Spider Man Brand New Day | గత రికార్డుల బద్ధలు..

భారత్‌లో తొలి రోజు వసూళ్ల పరంగా ఈ చిత్రం గతంలో విడుదలైన పలు హాలీవుడ్ బ్లాక్‌బస్టర్‌ల రికార్డులను అధిగమించినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం థియేటర్లలో ప్రదర్శితమవుతున్న ఇతర ప్రముఖ చిత్రాలతో పోటీ పడుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇదే జోరు కొనసాగితే ప్రారంభ వారాంతం ముగిసే నాటికి రూ.200 కోట్ల నెట్ మార్క్‌ను చేరుకునే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Spider Man Brand New Day | సిరీస్‌లో నాలుగో చిత్రం

మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లో టామ్ హాలండ్ నటించిన స్పైడర్ మ్యాన్ సిరీస్‌లో ఇది నాలుగో చిత్రం. గతంలో విడుదలైన ‘నో వే హోమ్’ ఘన విజయం సాధించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

దర్శకుడు డెస్టిన్ డానియల్ క్రెటన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో టామ్ హాలండ్‌తో పాటు జెండాయా, జాకబ్ బాటలాన్, సేడీ సింక్, జాన్ బెర్న్‌తాల్, ట్రామెల్ టిల్మాన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

మార్వెల్ అభిమానుల నుంచి వస్తున్న విశేష స్పందన, బలమైన అడ్వాన్స్ బుకింగ్స్ దృష్ట్యా ఈ చిత్రం రానున్న రోజుల్లో కూడా బాక్సాఫీస్ వద్ద తన జోరు కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *