Indian Deportation USA | అమెరికా నుంచి 4,840 మంది భారతీయుల బహిష్కరణ : విదేశాంగ శాఖ

అక్రమ వలసలను నియంత్రించేందుకు చేపడుతున్న చర్యల్లో భాగంగానే భారతీయులను కూడా స్వదేశానికి పంపినట్లు అధికారులు తెలిపారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Indian Deportation USA | అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులపై అక్కడి ప్రభుత్వం చేపడుతున్న చర్యల నేపథ్యంలో, గత ఏడాదిన్నర కాలంలో వేలాది మంది భారతీయులు స్వదేశానికి తిరిగి పంపబడ్డారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Indian Deportation USA | ఏడు నెలల్లో 1,273 మంది వెనక్కి

శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. 2025 నుంచి 2026 జులై July వరకు మొత్తం 4,840 మంది భారతీయులను అమెరికా నుంచి బహిష్కరించి భారత్‌కు పంపించారు. ఇందులో 2025 సంవత్సరంలో 3,567 మంది, 2026 జనవరి నుంచి జులై వరకు మరో 1,273 మంది ఉన్నట్లు పేర్కొంది.

అమెరికా వలస చట్టాలను ఉల్లంఘించి అక్రమంగా అక్కడ నివసిస్తున్న వారిపై అమెరికా ప్రభుత్వం కఠిన చర్యలు కొనసాగిస్తున్న నేపథ్యంలో ఈ బహిష్కరణలు జరిగినట్లు సమాచారం. అక్రమ వలసలను నియంత్రించేందుకు చేపడుతున్న చర్యల్లో భాగంగానే భారతీయులను కూడా స్వదేశానికి పంపినట్లు అధికారులు తెలిపారు.

Spider Man Brand New Day | బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే..రెండు రోజుల్లో రూ.100 కోట్ల నెట్ మార్క్ దాటిన భారత మార్కెట్​

Indian Deportation USA | చట్టబద్ధమైన వీసాలతోనే ప్రయాణించాలి

అమెరికాలో ఉపాధి లేదా ఇతర అవకాశాల కోసం వెళ్లే భారతీయులు చట్టబద్ధమైన వీసాలు, అవసరమైన పత్రాలతోనే ప్రయాణించాలని విదేశాంగ నిపుణులు సూచిస్తున్నారు. వలస నిబంధనలను ఉల్లంఘిస్తే బహిష్కరణతో పాటు భవిష్యత్తులో వీసా అవకాశాలపై కూడా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

ఇక అక్రమ వలసల అంశంపై భారత్, అమెరికా మధ్య పరస్పర సహకారం కొనసాగుతుండగా, చట్టపరమైన ప్రక్రియల ప్రకారమే బహిష్కరణలు నిర్వహిస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *