అక్షరటుడే, వెబ్‌డెస్క్: BHIM UPI Growth | నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థ అయిన ‘ఎన్‌పీసీఐ భీమ్ సర్వీసెస్ లిమిటెడ’(ఎన్బీఎస్ఎల్ ) అభివృద్ధి చేసిన భీమ్ పేమెంట్స్ యాప్ సత్తా చాటుతోంది. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా నెలవారీ యూపీఐ లావాదేవీలు (UPI Transactions) రెండేళ్లలో దాదాపు పది రెట్లు పెరిగాయి. గతనెలలో రూ. 25,613 కోట్ల విలువైన 224 మిలియన్ల యూపీఐ లావాదేవీలను ప్రాసెస్ చేయడం గమనార్హం. ఇది 2024 జూన్‌లో రూ. 7,966 కోట్ల విలువైన 23 మిలియన్ల లావాదేవీలను రికార్డు చేసింది.
BHIM UPI Growth | మొత్తం మార్కెట్ లో ఒక్క శాతమే..
భారతదేశపు సొంత చెల్లింపు యాప్ అనే గుర్తింపును పొందిన భీమ్ యూపీఐ లావాదేవీలు రెండేళ్లలో గణనీయంగా పెరిగాయి. అయితే దేశంలో మొత్తం యూపీఐ మార్కెట్‌లో ప్రస్తుతం భీమ్ వాటా కేవలం ఒక్క శాతంగానే ఉంది. ఇందులో విదేశీ కంపెనీలైన ఫోన్‌పే మరియు గూగుల్ పే కలిసి సుమారు 79 శాతం వాటాను కలిగి ఉన్నాయి. 2017 మొదటి అర్ధభాగంలో యూపీఐ లావాదేవీలలో సుమారు 40 శాతం వాటా భీమ్‌దే కావడం గమనార్హం. ఆ తర్వాత ప్రైవేట్ ప్లేయర్ల రాకతో క్రమంగా మార్కెట్‌ను కోల్పోతూ వచ్చింది.
BHIM UPI Growth | ఆర్థిక సేవల వైపు..
భీమ్ యాప్ తదుపరి దశలో మార్కెట్‌ను పెంచుకోవడం దిశగా అడుగులు వేస్తోంది. తన చెల్లింపుల వ్యాపారం ఆధారంగా విస్తృతమైన ఆర్థిక సేవల వ్యాపారాన్ని నిర్మించాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా రుణాలు మరియు క్రెడిట్ కార్డ్ ఉత్పత్తులలోకి ప్రవేశించాలన్న యోచనలో ఉంది.
BHIM UPI Growth | పెరిగిన వాట్సాప్ పే లావాదేవీలు..
చిన్న యూపీఐ యాప్ లలో వాట్సాప్ సైతం తన మార్కెట్ షేరును స్వల్పంగా పెంచుకుంది. ఈ సంస్థ 2024 జూన్‌లో 3.7 కోట్ల లావాదేవీలను ప్రాసెస్ చేయగా.. ఇది 2026 జూన్ నాటికి 15 కోట్లకు చేరింది. ఈ కాలంలో దాని మార్కెట్ వాటా 0.27 శాతం నుంచి 0.7 శాతానికి పెరిగింది.
ఇది కూడా చదవండి..: Ram Mandir Donations | అయోధ్య రామ మందిరం విరాళాల చోరీపై ఎస్పీ ఎంపీల నిరసన