AIIMS Bariatric Surgery | 209 కిలోల బరువున్న వ్యక్తికి బేరియాట్రిక్ సర్జరీ..విజయవంతంగా చేసిన ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు

అతని బరువు 181 కిలోల నుంచి 209 కిలోలకు పెరిగింది. అతని పొట్ట చుట్టుకొలత 198 సెంటీమీటర్లకు చేరడంతో సాధారణ ఆపరేషన్ టేబుల్ కూడా సరిపోని పరిస్థితి ఏర్పడింది.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: AIIMS Bariatric Surgery | ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యులు 209 కిలోల బరువున్న ఓ రోగికి అత్యంత క్లిష్టమైన బేరియాట్రిక్ (బరువు తగ్గించే) శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. జూలై 24న ఈ శస్త్రచికిత్స నిర్వహించగా, ప్రస్తుతం రోగి బరువు 160 కిలోలకు తగ్గినట్లు వైద్యులు తెలిపారు.

AIIMS Bariatric Surgery | అసాధరణంగా బరువు పెరగడంతో..

వైద్యుల వివరాల ప్రకారం, రోగి సకాలంలో శస్త్రచికిత్స చేయించుకోకపోవడంతో అతని బరువు 181 కిలోల నుంచి 209 కిలోలకు పెరిగింది. అంతేకాకుండా, అతని పొట్ట చుట్టుకొలత 198 సెంటీమీటర్లకు చేరడంతో సాధారణ ఆపరేషన్ టేబుల్ కూడా సరిపోని పరిస్థితి ఏర్పడింది.

AIIMS Bariatric Surgery | ప్రత్యేక డైట్​ ప్లాన్​..

ఈ నేపథ్యంలో ముందుగా 32 రోజుల పాటు ప్రత్యేక లో-క్యాలరీ ఆహార ప్రణాళికను అమలు చేసి, రోగి బరువును 209 కిలోల నుంచి 172 కిలోలకు తగ్గించారు. అనంతరం బేరియాట్రిక్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించినట్లు వైద్యులు వెల్లడించారు.

Pavan Chandana Vikram 1 | నవతరం స్ఫూర్తి ప్రదాత పవన్ చందన: మ్యాథ్స్​లో 50 మార్కుల నుంచి అంతరిక్ష చరిత్ర వరకు.. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన సంకల్పం

ఈ కేసు అత్యంత సంక్లిష్టమైనదైనా, వైద్య బృందం సమన్వయంతో విజయవంతంగా పూర్తిచేయడం విశేషమని ఎయిమ్స్ వైద్యులు పేర్కొన్నారు. శస్త్రచికిత్స అనంతరం రోగి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *