Paper Leak Bill | పేపర్‌ లీకేజీలపై కఠిన శిక్షలు.. బిల్లుకు కేంద్ర మంత్రివర్గ ఆమోదం

పేపర్‌ లీకేజీలకు పాల్పడే నిందితులకు కఠిన శిక్షలు పడేలా బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Paper Leak Bill | నీట్ (NEET)​ పేపర్​ లీకేజీపై యువత ఆందోళన నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. పేపర్‌ లీకేజీలకు పాల్పడే నిందితులకు కఠిన శిక్షలు పడేలా బిల్లుకు ఆమోదం తెలిపింది. ఢిల్లీలో కాక్రోచ్​ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసనల నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన శుక్రవారం మధ్యాహ్నం కేబినెట్ మీటింగ్​ జరిగింది ఈ సమావేశంలో బిల్లుకు ఆమోదం తెలిపారు.

పరీక్షా పత్రాల లీకేజీలకు కఠినమైన శిక్షలను ప్రతిపాదిస్తూ ఒక బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ చట్టాన్ని వచ్చే వారం పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. పరీక్షల మోసాలకు వ్యతిరేకంగా చట్టాలను ప్రభుత్వం పటిష్టం చేస్తుందని, ఫాస్ట్-ట్రాక్ కోర్టుల వంటి యంత్రాంగాల ద్వారా వేగవంతమైన విచారణకు నిబంధనలు చేర్చనుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు.

Paper Leak Bill | పదేళ్ల జైలు శిక్ష

పేపర్​ లీకేజీలకు పాల్పడే నిందితులకు పదేళ్ల వరకు జైలు శిక్ష, రూ.కోటి జరిమానా విధించేలా బిల్లులో పొందుపరిచినట్లు సమాచారం. ప్రస్తుతం పేపర్ లీక్ కేసులో దోషిగా తేలిన వ్యక్తులకు 3 నుండి 5 సంవత్సరాల జైలు శిక్ష, రూ.10 లక్షల వరకు జరిమానా విధిస్తున్నారు. కొత్త బిల్లులో జైలు శిక్షను పదేళ్ల వరకు, జరిమానాను రూ.కోటి వరకు పెంచినట్లు తెలిసింది. కేబినెట్ ఆమోదం పొందడంతో ఈ బిల్లును సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

Paper Leak Bill | ముగిసిన చర్చలు

ఓ వైపు కేంద్రం, ప్రధాని విద్యార్థులకు హామీ ఇచ్చిన సీజేపీ (CJP) ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్​ రాజీనామా చేసే వరకు నిరసనలు కొనసాగిస్తామని సీజేపీ నేతలు పేర్కొన్నారు. మరోవైపు కాక్రోచ్​ జనతా పార్టీ నాయకులతో కేంద్రం చర్చలు జరిపింది. ఈ చర్చల్లో మూడు డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచినట్లు సీజేపీ నాయకులు తెలిపారు. రెండు డిమాండ్లకు కేంద్రం పాజిటివ్‌గా ఉందన్నారు. ఆత్మహత్య చేసుకున్న నీట్‌ విద్యార్థులకు రూ.కోటి పరిహారం ఇవ్వాలని కోరామని తెలిపారు. నిరసనకారులపై కేసుల ఎత్తివేతకు కేంద్రం ఒప్పుకుందన్నారు. ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాల్సిందేనని చెప్పామని తెలిపారు. అప్పటి వరకు ఉద్యమం కొనసాగుతుందన్నారు.

దీనిని కూడా చదవండి  : KTR NEET Protest | మోదీ జాగ్రత్తగా ఉండు.. కేటీఆర్​ కీలక వ్యాఖ్యలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *