KTR NEET Protest | మోదీ జాగ్రత్తగా ఉండు.. కేటీఆర్​ కీలక వ్యాఖ్యలు

బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్ కేటీఆర్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. జెన్​జీతో పెట్టుకున్న మోదీ జాగ్రత్తగా ఉండాలన్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: KTR NEET Protest | తరం మారుతుంది, స్వరం మారుతుంది మోదీ జాగ్రత్తగా ఉండాలని బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేపాల్‌లో యువత తలుచుకుంటే ప్రభుత్వమే కూలిపోయిందని గుర్తు చేశారు.

కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్​ (Dharmendra Pradhan) రాజీనామా చేయాలని హైదరాబాద్​లోని ఇందిరా పార్క్​ వద్ద యువత నిరసన తెలుపుతున్నారు. వారికి శుక్రవారం కేటీఆర్​ సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నీట్ పేపర్​ లీకేజీ వ్యవహారంలో కఠిన చర్యలు తీసుకోవాలని యువత కదం తొక్కారన్నారు. 25 రోజుల పాటు సోనమ్​ వాంగ్​చుక్​ గాంధేయ మార్గంలో నిరాహార దీక్ష చేశారని చెప్పారు. అయితే ఈడీ, సీబీఐలకు భయపడి దీక్షను ఒక్క మీడియా సంస్థ కూడా చూపించలేదని ఆరోపించారు. కానీ విద్యార్థులు తమకు సోషల్ మీడియా ఉందని ధైర్యంగా పోరాడుతున్నారని కొనియాడారు.

KTR NEET Protest | లీకిన్​ ఇండియా ఇచ్చారు

మేకిన్‌ ఇండియా అడిగితే లీకిన్‌ ఇండియా ఇచ్చారని కేటీఆర్​ కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. యువత జవాబుదారీతనం కోరుతున్నారని పేర్కొన్నారు. 25 రోజులుగా ఢిల్లీలో పార్టీలకతీతంగా యువత పోరాడుతున్నారని, వారిపై జరుగుతున్న దాడులు దారుణం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. యువతకు అండగా నిలబడేందుకే ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు.

KTR NEET Protest | భయపడే జనరేషన్​ కాదు

ఎవరితో పెట్టుకోకూడదో వారితోనే మోదీ పెట్టుకున్నారని కేటీఆర్​ అన్నారు. ఈ జనరేషన్‌ చావుకు భయపడే రకం కాదని చెప్పారు. ఐటీ, ఈడీ సోదాలకు భయపడేవారు కాదన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్​ చేశారు.

KTR NEET Protest | నల్లమల పిల్లి ఎక్కడ

సీఎం రేవంత్​రెడ్డిపై కేటీఆర్​ విమర్శలు చేశారు. కేంద్రంపై నిరసన కోసం వస్తుంటే మధ్యలో కాంగ్రెస్ వాళ్లు తమను అడ్డుకున్నారని తెలిపారు. బడే భాయ్ కోసం చోటే భాయ్ అడ్డం పడుతున్నారని విమర్శించారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ పోయి మోదీ ఇంటి ముందు కూర్చుంటే.. ఈ నల్లమల పిల్లి పోయి కొడంగల్‌లో దాక్కుందని ఎద్దేవా చేశారు.

KTR NEET Protest | కేసీఆర్​ కూడా వస్తారు

అవసరమైతే విద్యార్థుల కోసం కేసీఆర్ కూడా వస్తారని కేటీఆర్ అన్నారు. సోషల్ మీడియాలో యువత ఆందోళన చూసి ఆయన తల్లడిల్లుతున్నారని పేర్కొన్నారు. పిల్లలే దేశ ముఖచిత్రాన్ని మారుస్తారు, వాళ్లే ఈ దేశాన్ని కాపుడుకుంటారని కరోనా సమయంలోనే కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు. పేపర్‌ లీక్‌కు తనకేం సంబంధం అని కేటీఆర్​ ప్రశ్నించారు. పేపర్‌ లీకుకు.. తనకు సంబంధం ఉందని నిరూపించి ఇందిరాపార్క్‌ దగ్గర ఉరితీయాలన్నారు. ఇటీవల సీఎం రేవంత్​రెడ్డి పేపర్​ లీక్​ విషయంలో కేటీఆర్​పై ఆరోపణలు చేశారు. దీంతో ఆయన స్పందించారు.

ఇది కూడా చదవండి..: Singareni Expansion Plans | సింగరేణి ఇతర రంగాలలోకి విస్తరించాలి : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *