అక్షరటుడే వెబ్డెస్క్: Revanth Reddy Jagga Reddy | సంగారెడ్డిలో జరిగిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డిపై ప్రశంసల జల్లు కురిపించారు. జగ్గారెడ్డి లాంటి నిబద్ధత గల నాయకుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత సంగారెడ్డి ప్రజలదేనని, రూ.100 కోట్లు ఖర్చు పెట్టినా ఆయన లాంటి లీడర్ దొరకడని కొనియాడారు. గత శాసనసభ ఎన్నికల్లో జగ్గారెడ్డి గెలిచి ఉంటే, ఈపాటికి ఆయన పార్టీలో లేదా ప్రభుత్వంలో అత్యంత కీలకమైన పదవిలో ఉండేవారని సీఎం తెలిపారు. కర్ణాటకలో బోసురాజుకు ముందుగా మంత్రి పదవి ఇచ్చి, ఆ తర్వాత ఎమ్మెల్సీని చేసిన ఉదాహరణను గుర్తుచేస్తూ.. తెలంగాణలో కూడా జగ్గారెడ్డి విషయంలో ఏదైనా జరగవచ్చంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Revanth Reddy Jagga Reddy | అధిష్టానానిదే తుది నిర్ణయం..
సంగారెడ్డి నుంచి జగ్గారెడ్డి పోటీ చేయాలా వద్దా అనేది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్ణయిస్తారని స్పష్టం చేశారు. పోటీలో నిలబడడం అనేది తన చేతిలో గానీ, జగ్గారెడ్డి చేతిలో గానీ లేదన్నారు. ఒకవేళ నిర్మలకు సంగారెడ్డి స్థానం కేటాయిస్తే, జగ్గారెడ్డికి వేరే చోట అవకాశం కల్పించే ఆలోచన ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. తాను పలుమార్లు హైదరాబాద్కు రావాలని కోరినప్పటికీ.. తనను నమ్ముకున్న సంగారెడ్డి ప్రజలను విడిచిపెట్టి రానని జగ్గారెడ్డి చెప్పారని, ప్రజల పట్ల ఆయనకు ఉన్న అంకితభావానికి ఇది నిదర్శనమని సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసించారు.
ఎన్నికల్లో ఓడినా…
కుటుంబాన్ని కూడా వదిలి ప్రజలతోనే ఉంటున్నారు..తెలంగాణలో జగ్గారెడ్డి లాంటి నాయకుడు లేడు..
100 కోట్లు ఖర్చు పెట్టినా జగ్గారెడ్డి లాంటి నాయకులు దొరకరు
అలాంటి నాయకులు ప్రజా జీవితంలో ఉండాలి.. ఆయనకు మీరు అండగా ఉండాలి.#RevanthReddy #SangaReddy pic.twitter.com/jYQOUmIS0W
— Congress for Telangana (@Congress4TS) August 15, 2026
ఇది కూడా చదవండి: Kamareddy Theft Arrest | ఆర్థిక ఇబ్బందులతో చోరీల బాట.. నిందితుడి అరెస్ట్