అక్షరటుడే, వెబ్‌డెస్క్: Bhatti Vikramarka | తెలంగాణ Telangana ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క Mallu Bhatti Vikramarka యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బర్కిలీకి చెందిన గోల్డ్‌మన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీలోని ఇండియా ఎనర్జీ అండ్ క్లైమేట్ సెంటర్ India Energy & Climate Center (IECC) ను సందర్శించారు.
ఈ సందర్భంగా భారతదేశ పునరుత్పాదక ఇంధన లక్ష్యాలు, వాటిని సాధించేందుకు అనుసరించాల్సిన కార్యాచరణ మార్గాలు, ఇంధన రంగంలో చోటుచేసుకుంటున్న మార్పులు, తెలంగాణలో కొనసాగుతున్న క్లీన్ ఎనర్జీ మార్పిడి తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు.
Bhatti Vikramarka | ఏమిటీ ఈ క్లైమేట్ సెంటర్..?
గోల్డ్‌మన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీలో ఏర్పాటైన ఇండియా ఎనర్జీ అండ్ క్లైమేట్ సెంటర్.. క్లీన్ ఎనర్జీ సాంకేతికత, విధాన రూపకల్పనలో యూసీ బర్కిలీ నైపుణ్యంతో పాటు సిలికాన్ వ్యాలీ ఆవిష్కరణలు, కాలిఫోర్నియా ఇంధన రంగ అనుభవాన్ని వినియోగిస్తూ ఇంధన వ్యవస్థల్లో వేగవంతమైన, ప్రయోజనకరమైన మార్పులకు సహకరిస్తోంది.
Bhatti Vikramarka | 500 గిగావాట్ల లక్ష్యంపై చర్చ
సమావేశంలో 2030 నాటికి దేశంలో 500 గిగావాట్ల నాన్-ఫాసిల్ ఇంధన విద్యుత్ సామర్థ్యాన్ని సాధించాలన్న భారతదేశ జాతీయ లక్ష్యంపై చర్చ జరిగింది. ఇంధన భద్రత అవసరాలు, క్లీన్ ఎనర్జీ సాంకేతికతల వ్యయం తగ్గుతున్న నేపథ్యంలో ఏర్పడుతున్న సాంకేతిక, ఆర్థిక అవకాశాలను కూడా పరిశీలించారు.
Yellow alert in Telangana : అలెర్ట్..ఆ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు
పునరుత్పాదక ఇంధన లక్ష్యాలను సాధించేందుకు విధాన రూపకల్పన, విద్యుత్ గ్రిడ్ ఆధునీకరణ, పరిశ్రమల డీకార్బనైజేషన్, ఎనర్జీ స్టోరేజ్ వ్యవస్థల అనుసంధానం, అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరేలా ఇంధన మార్పిడి వంటి అంశాలపై అభిప్రాయాలను పంచుకున్నారు.
Bhatti Vikramarka | తెలంగాణ క్లీన్ ఎనర్జీ మోడల్‌పై ప్రత్యేక దృష్టి
తెలంగాణలో కొనసాగుతున్న క్లీన్ ఎనర్జీ మార్పిడి ప్రక్రియపై సమావేశంలో ప్రత్యేకంగా చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ పవర్ పాలసీ ద్వారా భారీ స్థాయిలో పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యాన్ని పెంచేందుకు చర్యలు చేపట్టడంతో పాటు, గ్రీన్ పవర్ ప్రాజెక్టుల్లో గణనీయమైన పెట్టుబడులను ఆకర్షిస్తోంది.
సౌర విద్యుత్‌తో పాటు ఇతర పునరుత్పాదక ఇంధన వనరుల విస్తరణ, మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో చేపడుతున్న సౌర విద్యుత్ కార్యక్రమాలు, రైతులకు ప్రయోజనం చేకూర్చే పీఎం-కుసుమ్ వంటి పథకాల అమలును సమావేశంలో ప్రస్తావించారు.
Bhatti Vikramarka | ప్రత్యేకమైన రాష్ట్రస్థాయి నమూనా
తెలంగాణలో 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా, క్లీన్ ఎనర్జీ పరికరాల తయారీకి ప్రోత్సాహం, పునరుత్పాదక ఇంధనాన్ని పారిశ్రామిక అభివృద్ధితో అనుసంధానం చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారిస్తున్న అంశాలను వివరించారు.
భారతదేశ ఇంధన రంగ పరివర్తనలో తెలంగాణ అనుసరిస్తున్న విధానం ప్రత్యేకమైన రాష్ట్రస్థాయి నమూనాగా నిలుస్తోందని సమావేశంలో పేర్కొన్నారు. భవిష్యత్తులో క్లీన్ ఎనర్జీ, ఇంధన విధానాలు, సాంకేతికత, పెట్టుబడులు తదితర రంగాల్లో తెలంగాణతో మరింత సహకారం పెంపొందించుకునే అవకాశాలపైనా చర్చలు జరిగాయి.