Yadagirigutta Road Accident | యాదగిరిగుట్ట వెళ్తుండగా ప్రమాదం.. ఇద్దరు మృతి

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Yadagirigutta Road Accident | మహబూబ్ నగర్ జిల్లా (Mahabubnagar District) అడ్డాకల్ మండలం స్నేహ కంపెనీ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు ఢీకొంది. ఈ ప్రమాదంతో ఇద్దరు మృతి చెందారు.

పెబ్బేరు మండలం (Pebberu Mandal) కంచిరావుపల్లి గ్రామానికి చెందిన ప్రకాశ్​రెడ్డి తన కుటుంబంతో కలిసి కారులో యాదగిరి గుట్ట లక్ష్మీనర్సింహ స్వామి దర్శనానికి బయలు దేరాడు. ఈ క్రమంలో మార్గమధ్యలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆయన భార్య నందిని, ఏడు నెలల కుమారుడు కన్నయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రకాష్ రెడ్డికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Yadagirigutta Road Accident

Yadagirigutta Road Accident | అన్నమయ్య జిల్లాలో..

అన్నమయ్య జిల్లా (Annamayya District) మదనపల్లెలో రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్​ను లారీ ఢీకొంది. ఈ ఘటనలో తండ్రి, నాలుగు నెలల పసిపాప మృతి చెందారు. మృతుడి భార్య జ్యోతికి తీవ్ర గాయాలు అయ్యాయి. జ్యోతిని స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

ఇది కూడా చదవండి..: MMTS Free Travel | హైదరాబాద్లో ఎంఎంటీఎస్ ఉచిత ప్రయాణం.. జూన్ 2 నుంచి ప్రయోగాత్మకంగా ప్రారంభం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *