Iran Attack Indian Ship | క్లియరెన్స్ ఇచ్చి కాల్పులు జరుపుతున్నారు’.. ఇరాన్ దాడి సమయంలో భారతీయ నౌక నుంచి డిస్ట్రెస్ కాల్..!

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Iran Attack Indian Ship | ఇరాన్ దాడి సమయంలో భారతీయ నౌక నుంచి డిస్ట్రెస్ కాల్ వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఒక ఆడియో క్లిప్‌ బయటకు వచ్చినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

హార్ముజ్ జలసంధి (Strait of Hormuz)లో ఇరాన్ నౌకాదళం భారతీయ నౌకలను లక్ష్యంగా చేసుకున్న దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ సమయంలో ఇండియన్​ నౌక నుంచి ఓ అధికారి మాట్లాడినట్లు ఓ ఆడియో బయటకు వచ్చింది. ఆ రికార్డింగ్‌లో నౌక అధికారి మాట్లాడుతూ.. ‘తమ నౌకకు జలసంధి గుండా వెళ్లడానికి అనుమతి లభించినా, ఇరాన్ దళాలు కాల్పులు జరుపుతున్నాయి’ అంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

Iran Attack Indian Ship | వైరల్ ఆడియోలో ఏముందంటే..?

ఆడియో క్లిప్‌లో భారతీయ నౌక అధికారి (Indian Naval Officer) ఇలా అన్నట్లు వినిపిస్తోంది. “సెపాహ్ నేవీ, ఇది మోటార్ ట్యాంకర్ సన్మార్ హెరాల్డ్. మీరు నాకు వెళ్లడానికి క్లియరెన్స్ ఇచ్చారు. మీ జాబితాలో నా పేరు రెండవది. కానీ మీరు కాల్పులు జరుపుతున్నారు. నన్ను వెనక్కి తిరగడానికి అనుమతించండి.” అని అన్నట్లుగా వినిపించింది.

Iran Attack Indian Ship | మార్గం మార్చుకున్న పలు నౌకలు

పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో శనివారం రెండు భారతీయ నౌకలపై కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. దీంతో నాలుగు భారతీయ నౌకలు తమ మార్గం మార్చుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఒక భారతీయ ఆయిల్ ట్యాంకర్ (Indian Oil Tanker) మాత్రం హార్ముజ్ జలసంధి గుండా సురక్షితంగా బయటకు వచ్చినట్లు సమాచారం.

Iran Attack Indian Ship | ఇరాన్ తన నిర్ణయం ఎందుకు మార్చకుందంటే..!

ఇరాన్ అధికారులు తొలుత షిప్పింగ్ మార్గం తెరిచి ఉందని ప్రకటించారు. కానీ తర్వాత ఆ మార్గం మళ్లీ మూసివేసినట్లు ప్రకటించారు. అమెరికా ఇరాన్ ఓడరేవులపై బ్లాకేడ్ కొనసాగిస్తోందని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

Iran Attack Indian Ship | భారత్ తీవ్ర నిరసన

ఘటనపై భారత్ తీవ్రంగా స్పందించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇరాన్ రాయబారి మహమ్మద్ ఫతాలీని పిలిచి అధికారికంగా నిరసన తెలిపింది. హార్ముజ్ జలసంధిలో రెండు భారతీయ ఫ్లాగ్‌ ఉన్న నౌకలపై జరిగిన కాల్పుల ఘటనపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. వాణిజ్య నౌకల భద్రతకు భారత్ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపింది.

ఇది కూడా చదవండి..: Hormuz Strait Closure | అప్పటి వరకు హర్మూజ్‌ను మూసే ఉంచుతాం : ఇరాన్

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *