అక్షరటుడే, వెబ్‌డెస్క్ : DGP CV Anand | సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న తరుణంలో నేరాల స్వరూపం కూడా వేగంగా మారుతోందని, అలాంటి పరిస్థితుల్లో ఆధునిక సాంకేతికతను వినియోగించడమే సమర్థవంతమైన పోలీసింగ్‌కు మూల సూత్రమని డీజీపీ సీవీ ఆనంద్ అన్నారు. నేర నియంత్రణ, దర్యాప్తు, సైబర్ నేరాల ఛేదన, డేటా విశ్లేషణ వంటి రంగాల్లో సాంకేతిక పరిజ్ఞానం కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు.
హైదరాబాద్ (Hyderabad)లోని సీఐడీ ప్రధాన కార్యాలయంలో (CID Office) ఏర్పాటు చేసిన అత్యాధునిక కంప్యూటర్ ల్యాబ్‌తో పాటు షీ సైబర్ ల్యాబ్‌ను డీజీపీ శుక్రవారం ప్రారంభించారు. స్మార్ట్ క్రైమ్ అనాలిటిక్స్, డేటా మేనేజ్మెంట్, స్మార్ట్ కాన్ఫరెన్స్ సదుపాయాలతో రూపొందించిన ఈ వ్యవస్థ నేర పరిశోధనలో కొత్త ఒరవడికి నాంది పలుకుతుందని డీజీపీ పేర్కొన్నారు. తెలంగాణ పోలీస్ శాఖ సాంకేతిక వినియోగంలో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు సాధించిందన్నారు.
DGP CV Anand | మెరుగైన సేవలు
ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు నేరాలపై వేగవంతమైన చర్యలు తీసుకునేందుకు పోలీస్ శాఖ నిరంతరం కొత్త సాంకేతిక వ్యవస్థలను అందుబాటులోకి తీసుకొస్తోందన్నారు. ఇటీవల ఏర్పాటు చేసిన ‘టీ-స్పార్క్’ (T-SPARK) వంటి సాంకేతిక బృందాలు పోలీసింగ్‌లో ఆధునిక విధానాలను ప్రవేశపెట్టడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఏసీబీ, సీఐడీ డీజీ చారుసిన్హా, డీఐజీలు నవీన్ కుమార్, నారాయణ నాయక్, పరిమళ హనా నూతన్, ఎస్పీ మద్దిపాటి శ్రీనివాస్ పాల్గొన్నారు.
దీనిని కూడా చదవండి : MPDO MPO ACB Trap | ఏసీబీకి చిక్కిన ఎంపీడీవో, ఎంపీవో