MPDO MPO ACB Trap | ఏసీబీకి చిక్కిన ఎంపీడీవో, ఎంపీవో

మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట ఎంపీడీవో, ఎంపీవోను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : MPDO MPO ACB Trap | మరో ఇద్దరు అవినీతి అధికారులు ఏసీబీకి చిక్కారు. లంచం తీసుకుంటూ రెడ్​ హ్యాండెడ్​గా దొరికిపోయారు. ఈ ఘటన మహబూబాబాద్​ జిల్లాలో చోటు చేసుకుంది.

మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఒక వెంచర్ అనుమతి కోసం లంచం డిమాండ్ చేసి, అందులో రూ.45 వేలు తీసుకుంటుండగా ఎంపీడీవో రాధిక, ఎంపీవోతో పాటు ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన ఎంపీడీవో కుమారుడిని రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

MPDO MPO ACB Trap | స్థానికుల సంబరాలు

అవినీతి అధికారులు ప్రజలను పట్టి పీడిస్తున్నారు. లంచాల పేరిట వేధింపులకు పాల్పడుతున్నారు. పైసలు ఇస్తేనే పనులు చేస్తున్నారు. ఏసీబీ దాడులు (ACB Raids) చేస్తున్నా లంచాలకు మరిగిన అధికారులు భయపడటం లేదు. అయితే ఇలాంటి అధికారులు ఏసీబీకి చిక్కితే ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఎంపీడీవో, ఎంపీవోను ఏసీబీ అధికారులు పట్టుకోవడంతో ప్రజలు టపాకాయలు కాల్చి సంబురాలు చేసుకున్నారు.

ఇది కూడా చదవండి..: Singareni Medical Board | సింగరేణి ఉద్యోగులకు గుడ్​న్యూస్​.. త్వరలో సింగరేణి మెడికల్ బోర్డు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *