Employees Health Scheme | ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్​పై నేడు సీఎం సమీక్ష

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్: Employees Health Scheme | ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ అమలుపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆదివారం అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఉద్యోగులకు అమలు చేస్తున్న జేహెచ్​ఎస్​ స్థానంలో కొత్త పథకం అమలు చేస్తామని గతంలో సీఎం ప్రకటించిన విషయం తెలిసిందే.

Employees Health Scheme | రేపు కమిటీ ఏర్పాటు

Employees Health Scheme

 

ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రతకు సంబంధించి ఎంప్లాయిస్​ హెల్త్ స్కీమ్​ను ప్రభుత్వం అమల్లోకి తీసుకు వస్తుంది. ఎంప్లాయి హెల్త్ కేర్​ ట్రస్ట్ ద్వారా ఈ పథకం అమలు కానుంది. ఉద్యోగ సంఘాల నుంచి ఆరుగురు, పెన్షనర్ల నుంచి ఇద్దరు ప్రతినిధులు ఈ ట్రస్ట్ సభ్యులుగా ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి ఒకరిని ఈ ట్రస్ట్ కు సీఈవోగా నియమిస్తారు. ఈ కమిటీని రేపు ప్రకటించనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో సీఎం సమీక్ష నిర్వహించనున్నారు.

Employees Health Scheme | ఆదేశాలు జారీ

Employees Health Scheme

ఈ పథకం అమలు కోసం అవసరమైన వివరాల సేకరణ ఇప్పటికే మొదలైంది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యుల వివరాలను సేకరించేందుకు ఫైనాన్స్ శాఖ ఇప్పటికే అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. మే 31లోపు డేటా అప్‌లోడ్‌ చేయాలని పేర్కొంది. ఈ వివరాల ఆధారంగా డిజిటల్ హెల్త్ కార్డులు అందించనున్నారు. వాటితో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కుటుంబాలకు ప్రైవేట్​ ఆస్పత్రుల్లో క్యాష్‌లెస్ చికిత్స సేవలు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.

ఇది కూడా చదవండి..: Woman Murder | బైక్​పై వెళ్తున్న దంపతులపై దాడి.. మహిళ మృతి

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *