అక్షరటుడే, వెబ్‌డెస్క్: Telangana Deputy Collectors | తెలంగాణ (Telangana)లో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు జరిగాయి. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వ కార్యదర్శి లోకేశ్ కుమార్ జారీ చేశారు. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు.
Telangana Deputy Collectors | పోస్టింగ్ ఇచ్చిన స్థానాలివే..
జగిత్యాల అదనపు కలెక్టర్ బి.రాజా గౌడ్‌ను నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా నియమించారు. తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కార్యాలయంలో డిప్యూటేషన్‌పై ఉన్న ఎన్. ప్రసునాంబకు జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా పోస్టింగ్ ఇచ్చారు. హౌసింగ్ శాఖలో డిప్యూటేషన్‌పై ఉన్న డి.వెంకట మాధవరావును నిర్మల్ జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా బదిలీ చేశారు.
మహబూబ్‌నగర్‌లో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా ఉన్న పి.రాంరెడ్డికి వనపర్తి డీఆర్వోగా పోస్టింగ్ ఇచ్చారు. వెయిటింగ్లో ఉన్న ఏ.యాదగిరిని మహబూబ్‌నగర్‌లో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా నియమించారు. మోహన్ సింగ్‌ను రాజన్న సిరిసిల్ల జిల్లాలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా బాధ్యతలు అప్పగించారు. డిప్యూటీ కలెక్టర్ పి.పద్మ ప్రియకు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్‌కు డిప్యూటేషన్ ఇచ్చారు. డిప్యూటీ కలెక్టర్ సీహెచ్ కృష్ణయ్యకు మేడ్చల్–మల్కాజిగిరి పరిధిలోని ఎస్డీసీ, యూఎల్సీ విభాగంలో పోస్టింగ్ ఇచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న జి.కుమారస్వామిని పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా నియమించారు.
ఇది కూడా చదవండి..: Telangana Drought Situation | తెలంగాణలో వర్షాభావంపై సీఎం రేవంత్ రెడ్డి నజర్.. ఈనెల 12న మంత్రులతో ప్రత్యేక భేటీ