Bathukamma Celebrations | ఇందూరు పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

బోధన్​ పట్టణంలోని ఇందూరు హైస్కూల్‌లో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, బోధన్: Bathukamma Celebrations | పట్టణంలోని(bodhan) ఇందూరు హైస్కూల్‌లో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. దసరా సెలవులు రావడంతో పాఠశాల యాజమాన్యం ముందస్తుగా బతుకమ్మ వేడుకలను ఏర్పాటు చేసింది.

Bathukamma Celebrations | సందడి చేసిన విద్యార్థినులు..

ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు బతుకమ్మల చుట్టూ ఆడిపాడుతూ సందడి చేశారు. ఈ వేడుకల్లో స్థానిక కౌన్సిలర్ వేములపల్లి రామ్మూర్తి లక్ష్మి పాల్గొని బతుకమ్మ పండుగ ప్రాముఖ్యతను వివరించారు. పాఠశాల కరస్పాండెంట్ కొడాలి కిషోర్ మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను రాష్ట్రంతో పాటు ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ ఆడపడుచులు ఘనంగా జరుపుకుంటున్నారని తెలిపారు. ఇందూరు హైస్కూల్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు బతుకమ్మ, దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందూరు విద్యాసంస్థల డైరెక్టర్ కొడాలి సాయి విపంచి,హితిష్ పాల్గొన్నారు.

75yh

 

ఇది కూడా చదవండి: ‘హనుమాన్ అంశ్’.. తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *