అక్షరటుడే, బోధన్: Bodhan Congress BRS Clash | కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు బాహాబాహికి దిగడంతో పట్టణంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ ఘటన మంగళవారం చోటు చేసుకుంది.
Bodhan Congress BRS Clash | పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద..
స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ నాయకులు బోధన్ (Bodhan) పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఎమ్మెల్సీ తాతా మధు దిష్టిబొమ్మను దహనం చేశారు.. అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యిరోజుల పాలనపై బీఆర్ఎస్ నాయకులు నిరసన తెలిపేందుకు అంబేద్కర్ చౌరస్తాకు చేరుకున్నారు. ఇరు పార్టీల నాయకులు పోటాపోటీగా నిరసనలు చేపట్టారు. అనంతరం ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో ఒక్కసారిగా చౌరస్తా వద్ద ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.
కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనను నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చారు. అయితే స్పీకర్‌ను అవమానించిన బీఆర్ఎస్ నాయకులు అంబేడ్కర్‌కు వినతిపత్రం ఇచ్చే నైతిక హక్కు లేదని పేర్కొంటూ కాంగ్రెస్ నాయకులు ఆగ్రహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కౌన్సిలర్లు తూము శరత్ రెడ్డి, ఆదినారాయణ, మీర్ గౌస్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అంకు దాము, బీఆర్ఎస్ నాయకులు ముషీర్, బాబా, మోబిన్ ఖాన్, గుమ్ముల అశోక్ రెడ్డి, పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు రవీందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Dalit Speaker Remarks | దళిత స్పీకర్‌ను దూషించిన ఎమ్మెల్సీపై కఠిన చర్యలు తీసుకోవాలి