Kalyana Lakshmi Scheme | పేదింటి ఆడబిడ్డలకు అండగా ప్రభుత్వ పథకాలు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతా రావు

shashi kiran Mottala

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Kalyana Lakshmi Scheme | పేదింటి ఆడబిడ్డలకు అండగా ప్రభుత్వ పథకాలు నిలుస్తున్నాయని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు (MLA Thota Lakshmikantharao) అన్నారు. డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ తో కలిసి నిజాంసాగర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.

Kalyana Lakshmi Scheme | ఆర్థిక భారం తగ్గించేందుకు..

ఎమ్మెల్యే మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భారం తగ్గించేందుకు సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల లబ్ధి చేరేలా కట్టుబడి పనిచేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిజాంసాగర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రజా పండరి, మండలంలోని సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, యువజన కాంగ్రెస్ నాయకులు, సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Forest Officer Death | ప్రాణం తీసిన ఈత సరదా.. స్విమ్మింగ్‌పూల్‌లో మునిగి ఫారెస్ట్ అధికారి మృతి

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *