అక్షరటుడే, కామారెడ్డి: Forest Officer Death | స్విమ్మింగ్ పూల్లో మునిగి అటవీశాఖాధికారి మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన కామారెడ్డి మండలంలోని నర్సన్నపల్లి (Narsannapalli) శివారులోని ఈత కొలనులో చోటు చేసుకుంది.
Forest Officer Death | మెదక్ జిల్లా వెల్దుర్తి ఫారెస్ట్ సెక్షన్లో..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా (Medak District) వెల్దుర్తి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న చింతకింది శ్రీనివాస్ (43) కామారెడ్డి (Kamareddy)లో నివాసముంటున్నాడు. గురువారం సాయంత్రం తన కుమారుడిని వెంటబెట్టుకొని నరసన్నపల్లి శివారులోని ఓ స్విమ్మింగ్‌పూల్‌కు వెళ్లారు. అక్కడ ఈత కొడుతుండగా, సరిగ్గా ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయారు.

వెంటనే గమనించిన అక్కడి సిబ్బంది, స్థానికులు బయటకు తీసి ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అప్పటికే శ్రీనివాస్ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనపై మృతుడి భార్య స్వప్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఫారెస్ట్ అధికారి అకాల మరణంతో వెల్దుర్తి మండలంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సహోద్యోగులు, కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.
ఇది కూడా చదవండి..: Bike Theft | బైక్ చోరీలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్ట్


