అక్షటుడే, పెద్దకొడప్గల్: School Admissions | మండల కేంద్రంలోని (Pedda Kodapgal) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కొత్తగా 113 విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. హెచ్ఎం కమల నేతృత్వంలో ఉపాధ్యాయులు పడిన కష్టానికి ప్రతిఫలం లభించింది.
School Admissions | ప్రైవేట్‌కు ధీటుగా..
పాఠశాలలో (Government School) 113వ అడ్మిషన్‌ను మంగళవారం ఎంఈవో ప్రవీణ్ కుమార్ చేతలు మీదుగా హెచ్ఎం తీసుకున్నారు. ఎంఈవో మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, ఇంగ్లిష్ మీడియం బోధన, ‘మన ఊరు–మన బడి–పీఎం శ్రీ’ (PM SHRI) లాంటి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న సందర్భంగా విద్యార్థుల సంఖ్య పెరుగుతోందన్నారు. ఫలితంగా ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ బడులకు విద్యార్థుల వలసలు పెరిగి, అనేక పాఠశాలల్లో అడ్మిషన్లు భారీగా (Student Enrolment) పెరుగుతున్నాయన్నారు. స్మార్ట్ తరగతులు, డిజిటల్ విద్య, ప్రయోగశాలలు, మెరుగైన మౌలిక సదుపాయాలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందని.. విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, మధ్యాహ్న భోజనంతో పాటు పౌష్టికాహారాన్ని అందచేస్తున్నామన్నారు. అలాగే ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతిలో ఉత్తీర్ణత శాతం పెంచాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయురాలు కమల, నాగనాథ్, కిషోర్, రాజు, సుదర్శన్ రెడ్డి ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి : Siddapur Reservoir | సిద్ధాపూర్ రిజర్వాయర్ పనులు వేగవంతం చేయాలి