Tribal University Convocation | వికసిత్ భారత్ లక్ష్య సాధనలో యువతదే కీలక పాత్ర: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ట్రైబల్ యూనివర్సిటీ (కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం) ప్రథమ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Tribal University Convocation | ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ (కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం) ప్రథమ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. ఈ చారిత్రక కార్యక్రమానికి భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ( Droupadi Murmu )ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఉన్నత విద్య పూర్తి చేసుకుని నూతన జీవితంలోకి అడుగుపెడుతున్న విద్యార్థులకు ఆమె పట్టాలను ప్రదానం చేశారు.

Tribal University Convocation | ప్రతిభకు పట్టాభిషేకం..

ఈ ప్రదానోత్సవంలో డిగ్రీ, పీజీ పూర్తి చేసిన మొత్తం 373 మంది విద్యార్థులకు రాష్ట్రపతి పట్టాలను అందజేశారు. విద్యాభ్యాసంలో అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించిన 13 మంది విద్యార్థులకు బంగారు పతకాలను (Gold Medals) బహూకరించి అభినందించారు.

droupathi.1

Tribal University Convocation | వికసిత్ భారత్ మహాసంకల్పం..

భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలన్న ‘వికసిత్ భారత్’ లక్ష్య సాధనలో యువతే కీలకమైన శక్తి” అని రాష్ట్రపతి స్పష్టం చేశారు. తమ నైపుణ్యాలు, వినూత్న ఆలోచనలతో దేశ ప్రగతికి యువత బాటలు వేయాలని ఆమె పిలుపునిచ్చారు. నాణ్యమైన విద్య కేవలం డిగ్రీలకే పరిమితం కాదని, అది వ్యక్తి జీవితాన్ని సామాజికంగా, ఆర్థికంగా ఉన్నత స్థితికి చేర్చే ఒక శక్తివంతమైన సాధికారత ఆయుధమని ఆమె పేర్కొన్నారు.

Tribal University Convocation | ప్రపంచంతో పోటీ పడాలని..

మన దేశానికి మూలస్తంభాల వంటి గిరిజన సంప్రదాయాలను, సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని గుర్తుచేశారు. అదే సమయంలో, మారుతున్న కాలానికి అనుగుణంగా గిరిజన విద్యార్థులు ఆధునిక సాంకేతికతను (Modern Technology) అందిపుచ్చుకుని ప్రపంచంతో పోటీ పడాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు.

ఇది కూడా చదవండి: Kamareddy Moram Mining | పట్టపగలే దర్జాగా మొరం తవ్వకాలు.. పట్టించుకోని రెవెన్యూ, మైనింగ్ శాఖ అధికారులు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *