Telangana Cabinet Meeting | సచివాలయంలో జులై 2న కేబినెట్ అత్యవసర సమావేశం

తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి అత్యవసర సమావేశం జరగనుంది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Telangana Cabinet Meeting | తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి అత్యవసర సమావేశం జరగనుంది. జులై 2వ తేదీ (గురువారం) మధ్యాహ్నం 3:00 గంటలకు ముఖ్యమంత్రి అధ్యక్షతన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలోని ( Secretariat ) 6వ అంతస్తులో ఈ భేటీ నిర్వహించనున్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న 34వ మంత్రిమండలి సమావేశం కావడం గమనార్హం. దీనికి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు  మంగళవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

Telangana Cabinet Meeting | అజెండా రూపకల్పనలో..

కేబినెట్ భేటీ నేపథ్యంలో అన్ని శాఖలు అజెండా రూపకల్పనలో నిమగ్నమయ్యాయి. వివిధ శాఖల కార్యదర్శులు తమ అజెండా అంశాలను తెలుగు అనువాదంతో సహా జులై 1వ తేదీ మధ్యాహ్నం 1:00 గంటలోపు సాధారణ పరిపాలన (కేబినెట్) శాఖకు పంపాలని సీఎస్ ఆదేశించారు. ఒకవేళ తమ శాఖలో అజెండా అంశాలేవీ లేకపోయినా, ‘నిల్’ (NIL) రిపోర్టును సమర్పించాలని స్పష్టం చేశారు.

Telangana Cabinet Meeting | ఉన్నతాధికారులకు హెచ్చరిక..

మంత్రిమండలి సమావేశం ముగిసే వరకు శాఖాధిపతులు, కార్యదర్శులు అందరూ తప్పనిసరిగా తమ ప్రధాన కార్యాలయాల్లోనే (హెడ్ క్వార్టర్స్) అందుబాటులో ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. పరిపాలనలో ఎటువంటి అంతరాయం కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు.

Telangana Cabinet Meeting | ఏయే అంశాలపై చర్చ జరగవచ్చు?

రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ, పరిపాలనా పరిస్థితులు, కీలకమైన ప్రజా సంక్షేమ పథకాలు, , కొన్ని ముఖ్యమైన బిల్లుల ఆమోదంపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉందని సచివాలయ వర్గాలు చెబుతున్నాయి. ఈ సమావేశం కోసం ప్రోటోకాల్, హార్టికల్చర్, , సచివాలయ విభాగాల అధికారులకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం సూచించింది.

ఇది కూడా చదవండి: Telangana Airtel Data Centers | తెలంగాణలో డేటా సెంటర్ల విస్తరణ.. సీఎంతో భేటీ అయిన సునీల్ మిట్టల్

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *