OU Affiliation Colleges | అనుమతి లేని కాలేజీల్లో చేరి మోసపోవద్దు : సీపీ సజ్జనార్​

అనుమతి లేని కాలేజీల్లో చేరి మోసపోవద్దని హైదరాబాద్ సీపీ సజ్జనార్​ సూచించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : OU Affiliation Colleges | అనుమతి లేని కాలేజీల్లో చేరి మోసపోవద్దని హైదరాబాద్ సీపీ సజ్జనార్ (CP Sajjanar)​ సూచించారు. డిగ్రీ కోర్సుల్లో చేరబోతున్న విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఆయన పలు సూచనలు చేశారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయం (OU) అనుబంధ గుర్తింపు (అఫిలియేషన్) లేకపోయినా, ఉన్నట్లుగా తప్పుడు ప్రచారాలు చేస్తూ విద్యార్థులను మోసం చేస్తున్న విద్యాసంస్థల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సీపీ పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించి, తప్పుడు ప్రకటనలతో అనధికారికంగా అడ్మిషన్లు జరుపుతున్న కాలేజీలపై చర్యలు ప్రారంభించామన్నారు.

OU Affiliation Colleges | ఓయూ అధికారుల ఫిర్యాదుతో..

students

కమిషనరేట్ పరిధిలోని పలు ప్రాంతాల్లో కొన్ని డిగ్రీ కాలేజీలు (Degree Colleges) తమకు ఓయూ అఫిలియేషన్ ఉందంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్న విషయాన్ని ఉస్మానియా విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు తమ దృష్టికి తీసుకువచ్చారని చెప్పారు. దీనిపై విచారణ జరపగా.. ఆయా కాలేజీలకు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎలాంటి గుర్తింపు లేదా అనుమతి లభించలేదని స్పష్టమైంది.

తప్పుడు ప్రకటనలను నమ్మి విద్యా సంవత్సరాన్ని, కష్టార్జితమైన డబ్బును నష్టపోవద్దని సూచించారు. ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న ‘దోస్త్’ (DOST) వెబ్‌సైట్‌లో నమోదై, అందులో చూపిస్తున్న గుర్తింపు పొందిన కాలేజీల్లోనే ప్రవేశాలు పొందాలన్నారు. తప్పుడు ప్రకటనలతో విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకునే యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇలాంటి కాలేజీల సమాచారం తెలిస్తే వెంటనే డయల్ 100 కి ఫోన్ చేసి చెప్పాలన్నారు.

దీనిని కూడా చదవండి : TTD VIP Darshan | తిరుమల భక్తులకు అలర్ట్.. జులైలో రెండు రోజుల పాటు వీఐపీ దర్శనాలు రద్దు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *