TTD VIP Darshan | తిరుమల భక్తులకు అలర్ట్.. జులైలో రెండు రోజుల పాటు వీఐపీ దర్శనాలు రద్దు

తిరుమల శ్రీవారి ఆలయంలో జరగనున్న విశేష ఉత్సవాల నేపథ్యంలో టీటీడీ (Tirumala Tirupati Devasthanams) కీలక నిర్ణయం తీసుకుంది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: TTD VIP Darshan | తిరుమల శ్రీవారి ఆలయంలో జరగనున్న విశేష ఉత్సవాల నేపథ్యంలో టీటీడీ (Tirumala Tirupati Devasthanams) కీలక నిర్ణయం తీసుకుంది. జులై నెలలో జరగనున్న ప్రధాన పర్వదినాల దృష్ట్యా, కొన్ని రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ మార్పులను భక్తులు గమనించి, తమ యాత్ర ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని సూచించింది.

TTD VIP Darshan | దర్శనాల రద్దుకు కారణాలు..

శ్రీవారి ఆలయంలో జులై 14న ‘కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం’ కార్యక్రమం , జులై 17న అత్యంత వైభవంగా ‘ఆణివార ఆస్థానం’ వేడుకలు జరగనున్నాయి. ఈ విశేష ఉత్సవాల నిర్వహణ కోసం ఆలయ యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఈ వేడుకల సమయంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేయాలని నిర్ణయించారు.

ttd.1

TTD VIP Darshan | సిఫార్సు లేఖల స్వీకరణపై ఆంక్షలు..

వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు కావడంతో, దానికి ముందు రోజుల్లో వచ్చే సిఫార్సు లేఖల విషయంలోనూ టీటీడీ స్పష్టతనిచ్చింది. జులై 13 , జులై 16 తేదీల్లో బ్రేక్ దర్శనాలకు సంబంధించిన ఎటువంటి సిఫార్సు లేఖలను స్వీకరించబోమని అధికారులు స్పష్టం చేశారు. కాబట్టి, భక్తులు ఈ రోజుల్లో సిఫార్సు లేఖలతో రావద్దని కోరారు.

TTD VIP Darshan | రద్దయిన ఆర్జిత సేవలు..

‘ఆణివార ఆస్థానం’ సందర్భంగా జులై 17వ తేదీన ఆలయంలో జరగాల్సిన నిత్య ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. ఆ రోజున కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం , సహస్ర దీపాలంకరణ సేవలు ఉండవు. భక్తులు ఈ మార్పులను గమనించి, తమ పర్యటనను అనుకూలంగా మార్చుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

ఇది కూడా చదవండి:  Paddy Bonus Guidelines | సన్నాలకు బోనస్​పై ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు.. రైతులకు తిప్పలు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *