Sowcar Janaki | ప్రముఖ నటి షావుకారు జానకి కన్నుమూత

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Sowcar Janaki | భారతీయ చలనచిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ నటి షావుకారు జానకి (94) చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలు, శ్వాసకోశ ఇబ్బందులతో బాధపడుతున్న ఆమె.. తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆమెను కావేరి ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె కన్నుమూశారు.

Sowcar Janaki | నాటకాల నుంచి వెండితెరకు..

ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరంలో 1931 డిసెంబర్ 12న జన్మించిన షావుకారు జానకి అసలు పేరు జానకి. మరో ప్రముఖ నటి కృష్ణకుమారికి ఆమె చెల్లెలు అవుతారు. చిన్నతనంలోనే నాటకాలతో కెరీర్ ప్రారంభించిన ఆమె, 11 ఏళ్ల వయసులోనే రేడియో కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత 1949లో విడుదలైన ‘రక్షా రేఖ’ సినిమాతో నటిగా వెండితెరకు పరిచయమయ్యారు.

Sowcar Janaki | ప్రత్యేక గుర్తింపు..

1950లో విడుదలైన ‘షావుకారు’ సినిమా ఘనవిజయం సాధించడంతో ఆమె పేరు కాస్తా ‘షావుకారు జానకి’గా స్థిరపడింది. తెలుగు, తమిళ, కన్నడ భాషలతో పాటు హిందీ, మలయాళ చిత్రాల్లోనూ ఆమె నటించారు. దాదాపు 400కు పైగా సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించి ప్రేక్షకులను అలరించారు. ఆమె చేసిన కళా సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 2022లో ఆమెను ప్రతిష్టాత్మక ‘పద్మశ్రీ’ పురస్కారంతో సత్కరించింది.

Sowcar Janaki | అద్భుతమైన పాత్రలు..

‘కన్యాశుల్కం’, ‘రోజులు మారాయి’, ‘డాక్టర్ చక్రవర్తి’, ‘సంసారం ఒక చదరంగం’, ‘తోడికోడళ్ళు’, ‘గీతాంజలి’ వంటి ఎన్నో అజరామరమైన చిత్రాల్లో ఆమె నటించారు. చివరిసారిగా ‘అన్నీ మంచి శకునములే’ చిత్రంలో ఆమె కనిపించారు. ఆమె మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Tamil Nadu free cars | ఉచిత కార్లు మాకొద్దు.. డీఎంకే ఎమ్మెల్యేల ప్రకటన

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *