Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
ePaper
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Top Categories
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • ఆంధ్రప్రదేశ్​
    • సినిమా
  • జిల్లాలు
    • హైదరాబాద్
    • నిజామాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • మహబూబ్‌నగర్
  • Pages
    • Home
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms and Conditions
Follow US

Home - సినిమా

సినిమా

Nagabandham Movie Review | విజువల్ వండర్‌గా ‘నాగబంధం’.. ఆడియన్స్ పల్స్, పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే!

తులసీవనం అనే గ్రామంలో సాధారణ జీవితం గడిపే రుద్ర (విరాట్ కర్ణ) అనుకోకుండా ఈ ప్రమాదకరమైన మిస్టరీలో భాగమవాల్సి వస్తుంది. అసలు బ్రహ్మకమలం ఎవరికి దక్కింది? రుద్రకు, ఆ కమలానికి ఉన్న లంకె ఏంటి? పార్వతి (నభా నటేష్) పాత్ర వెనుక ఉన్న రహస్యమేంటి?

Naresh Chandan
Last updated: July 3, 2026, 7:33 am 7:33 am
Naresh Chandan
Share
Nagabandham Movie Review

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Nagabandham Movie Review | ‘పెదకాపు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన యంగ్ హీరో విరాట్ కర్ణ కథానాయకుడిగా, ప్రముఖ నిర్మాత, దర్శకుడు అభిషేక్ నామా తెరకెక్కించిన మోస్ట్ అవేటెడ్ మైథికల్ అడ్వెంచర్ థ్రిల్లర్ ‘నాగబంధం’. అభిషేక్ పిక్చర్స్‌, ఎన్‌ఐకే స్టూడియోస్ బ్యానర్లపై కిషోర్ అన్నపురెడ్డి భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం.. భారీ అంచనాల మధ్య జులై 3 (శుక్రవారం) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది.

నాగబంధం రహస్యం, దాని వెనుక ఉన్న 108 విష్ణు దేవాలయాల చారిత్రక నేపథ్యంతో రూపొందిన ఈ పాన్-ఇండియా చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ‘పబ్లిక్ టాక్’ ద్వారా తెలుసుకుందాం!

Nagabandham Movie Review | కథా నేపథ్యం

ఈ కథ 1756 నుండి 1962 మధ్య కాలంలో సాగే ఒక అద్భుతమైన మిస్టరీ జర్నీ. ప్రముఖ ఆర్కియాలజిస్ట్ ప్రభాకర్ (జగపతి బాబు) తన కెరీర్‌లో ఎన్నో చారిత్రక రహస్యాలను ఛేదించినా.. ‘నాగబంధం’ అనే మర్మాన్ని మాత్రం వెలికితీయలేకపోతాడు. ఆ అసంపూర్ణ పరిశోధనను ఆయన శిష్యులు టెస్లా, అలీ (రిషబ్ సాహ్నీ) ముందుకు తీసుకెళ్తారు. ఈ క్రమంలో వారి ప్రయాణం హిమాలయాలకు చేరుకుంటుంది.

అక్కడ శతాబ్దాలుగా బంధించబడిన బైరాగి (గరుడ రామ్) మాయలో పడిన అలీ.. నాగబంధాన్ని విముక్తి చేసి, లోకాన్ని శాసించే అపార శక్తులను సొంతం చేసుకోవాలని చూస్తాడు. ఇందుకోసం శ్రీరంగనాథ స్వామి ఆలయంలోని పవిత్ర ‘బ్రహ్మకమలాన్ని’ దక్కించుకోవడానికి దారుణాలకు ఒడిగడతాడు.

మరోవైపు, తులసీవనం అనే గ్రామంలో సాధారణ జీవితం గడిపే రుద్ర (విరాట్ కర్ణ) అనుకోకుండా ఈ ప్రమాదకరమైన మిస్టరీలో భాగమవాల్సి వస్తుంది. అసలు బ్రహ్మకమలం ఎవరికి దక్కింది? రుద్రకు, ఆ కమలానికి ఉన్న లంకె ఏంటి? పార్వతి (నభా నటేష్) పాత్ర వెనుక ఉన్న రహస్యమేంటి? 17వ శతాబ్దానికి చెందిన నాగసాధువు శివతో రుద్రకు ఉన్న సంబంధం ఏంటి? బైరాగి కుట్రలను రుద్ర ఎలా అడ్డుకున్నాడు? అనేదే మిగతా కథ.

Tryambakeswaram Amritakundam | కాలగర్భం నుంచి శంకరుడు కదిలి వచ్చాడా..? త్రయంబకేశ్వర అమృతకుండ రహస్యాలపై ప్రత్యేక శోధన!

Nagabandham Movie Review | టాక్ ఎలా ఉందంటే..

విడుదలకు ముందే టీజర్, ట్రైలర్‌తో హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమాకు ప్రస్తుతం సోషల్ మీడియాలో పాజిటివ్ అండ్ మిక్స్‌డ్ టాక్ వినిపిస్తోంది.

akshara today .jpgnaga

Nagabandham Movie Review | ప్లస్ పాయింట్స్

విజువల్ ఫీస్ట్: సినిమాను విజువల్‌గా చాలా రిచ్‌గా తెరకెక్కించారు. వీఎఫ్ఎక్స్ (VFX), గ్రాఫిక్స్ వర్క్ హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయని ప్రేక్షకులు కొనియాడుతున్నారు.

హీరో పర్ఫార్మెన్స్: హీరో విరాట్ కర్ణ తన నటనతో మెప్పించాడు. ముఖ్యంగా క్లైమాక్స్ చివరి 20 నిమిషాల్లో ఆయన చూపించిన ఈజ్, యాక్షన్ సీక్వెన్స్ లు సినిమాను నెక్స్ట్‌ లెవెల్‌కు తీసుకెళ్లాయని నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు.

హై మూమెంట్స్: నాగబంధం మర్మాన్ని పరిచయం చేసే ఓపెనింగ్ సీన్స్, ఇంటర్వెల్ ట్విస్ట్, ‘నమో రే’ సాంగ్ పిక్చరైజేషన్, 1756 నాటి ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

నటీనటుల ప్రతిభ: హీరోయిన్ నభా నటేష్, ఐశ్వర్య మీనన్ తమ పాత్రల్లో ఒదిగిపోగా, మిస్టీరియస్ రోల్‌లో అనసూయ భరద్వాజ్ (లీలావతి పాత్ర) నటన ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి.

Nagabandham Movie Review | మైనస్ పాయింట్స్

నెమ్మదించిన కథనం: దర్శకుడు విజువల్స్, హంగులపై పెట్టిన శ్రద్ధ కథలోని ఎమోషన్స్‌పై పెట్టలేదని కొందరి అభిప్రాయం.

ల్యాగ్ సీన్స్: సెకండాఫ్‌లో కొన్ని సీన్లు సాగతీతగా అనిపించడం, కథకు పెద్దగా ఉపయోగపడని కొన్ని క్యారెక్టర్ల వల్ల పేసింగ్ కొద్దిగా తగ్గినట్లు టాక్.

Nagabandham Movie Review | ఫైనల్ వర్డిక్ట్

మొత్తంగా చూసుకుంటే, సనాతన ధర్మం, పురాణాల నేపథ్యంలో సాగే అడ్వెంచర్ సినిమాలను, మైథికల్ థ్రిల్లర్స్‌ను ఇష్టపడే వారికి ‘నాగబంధం’ ఒక సరికొత్త విజువల్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. కొన్ని స్క్రీన్‌ప్లే లోపాలు ఉన్నప్పటికీ.. గ్రాండ్ మేకింగ్, అదిరిపోయే యాక్షన్ ఎపిసోడ్స్ కోసం థియేటర్లలో ఈ వీకెండ్‌కు ఖచ్చితంగా చూడదగ్గ చిత్రం!

TAGGED:Abhishek NamaMythical Thriller MoviesNabha NateshNagabandham Movie ReviewNagabandham Public TalkNagabandham Telugu MovieNagabandham Twitter ReviewVirat Karna
Naresh Chandan
ByNaresh Chandan
Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Aug 07 Horoscope July 03 Horoscope | తోబుట్టువుల సమ ఆర్థిక ఇబ్బందులన్నీ క్లియర్.. కుటుంబ సభ్యులతో గడపడం.. బలపడనున్న ఈ రాశుల వారి బంధాలు!
Next Article Indonesia Earthquake Indonesia Earthquake | ఇండోనేషియాలో భారీ భూకంపం: టోబెలో సమీపంలో 6.2 తీవ్రతతో ప్రకంపనలు
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

Shruti Haasan Marriage
సినిమా

Shruti Haasan Marriage | త్వ‌ర‌లోనే పెళ్లి పీట‌లు ఎక్క‌బోతున్న శృతి హాస‌న్.. ల‌వ్వా లేకుంటే అరెంజ్డ్ మ్యారేజా?

By Srinivas Kolluri
Peddi Movie Review | రామ్ చరణ్ అదిరిపోయే బాడీ బిల్డింగ్.. జాన్వీ కపూర్ అందాల కనువిందు.. 'పెద్ది' రివ్యూ
సినిమా

Peddi Trolling | ‘పెద్ది’పై నెగిటివ్ ట్రోలింగ్.. పోలీసులకు చిత్ర యూనిట్ ఫిర్యాదు

By Balla Sandeep Kumar
Upasana Konidela
సినిమాఆంధ్రప్రదేశ్​తెలంగాణ

Upasana Konidela | పాశ్చాత్యం వద్దు.. భారతీయ సంప్రదాయమే ముద్దు.. టాయిలెట్ వినియోగంపై ఉపాసన ప్రచారం!

By Naresh Chandan
Pawan Kalyan Sinus Surgery
సినిమా

Pawan Kalyan Sinus Surgery | ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి జ‌రిగిన శ‌స్త్ర చికిత్స‌పై వ‌చ్చిన క్లారిటీ.. తిరుమ‌ల‌కి వెళ్లిన‌ప్పుడే బ‌య‌ట‌ప‌డిందా?

By Srinivas Kolluri
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.