Indian Stock Market | ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ శుక్రవారం ఒడిదుడుకుల మధ్య కొనసాగి ఫ్లాట్ గా ముగిసింది. సెన్సెక్స్ 3 పాయింట్లు, నిఫ్టీ 20 పాయింట్లు పెరిగాయి.

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్: Indian Stock Market | అమెరికా -ఇరాన్ మధ్య నిలిచిపోయిన చర్చలు, పెరిగిన చమురు ధరలు, పెరుగుతున్న అమెరికా బాండ్ ఈల్డ్స్, ద్రవ్యోల్బణ భయాలతో ఇన్వెస్టర్లు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. దీంతో మార్కెట్లు ఒత్తిడికి గురవుతున్నాయి. శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులకు లోనై ఫ్లాట్‌గా ముగిసింది. మెటల్, ప్రభుత్వ రంగ బ్యాంకులలో కొనుగోళ్ల మద్దతు కనిపించగా.. ఆటో, ఐటీ, ఫార్మా రంగాల స్టాక్స్ అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి.

Indian Stock Market | లాభాలతో ప్రారంభమై..

దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic stock market) శుక్రవారం ఉదయం లాభాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్ 164 పాయింట్ల గ్యాప్ అప్‌లో ప్రారంభమై మరో 24 పాయింట్లు పెరిగింది. అక్కడినుంచి 280 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ 53 పాయింట్ల లాభంతో ప్రారంభమైనా నిలదొక్కుకోలేక 78 పాయింట్లు కోల్పోయింది. రోజంతా స్వల్ప ఒడిదుడుకుల మధ్య కొనసాగింది. చివరికి సెన్సెక్స్ 3 పాయింట్ల లాభంతో 77,540 వద్ద, నిఫ్టీ 20 పాయింట్ల లాభంతో 24,252 వద్ద స్థిరపడ్డాయి.

Indian Stock Market | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..

బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 2,450 కంపెనీలు లాభపడగా 1,874 స్టాక్స్ నష్టపోయాయి. 225 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 176 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 92 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 26 స్టాక్ లాభపడగా.. 4 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. పవర్‌గ్రిడ్ 2.66 శాతం, బీఈఎల్ 1.17 శాతం, కొటక్ బ్యాంక్ 1.08 శాతం, ఎన్టీపీసీ 0.61 శాతం, బజాజ్ ఫిన్‌సర్వ్ 0.60 శాతం లాభపడ్డాయి.

Top Losers : ట్రెంట్ 1.53 శాతం, మారుతి 1.51 శాతం, ఇండిగో 1.35 శాతం, హెచ్సీఎల్ టెక్ 1.21 శాతం, హెచ్యూఎల్ 0.96 శాతం నష్టపోయాయి.

ఇది కూడా చదవండి..: Starlink India | భారత్‌లో మారుమూల ప్రాంతాలకూ స్టార్‌లింక్ సేవలందిస్తాం: ఎలాన్‌ మస్క్

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *