Starlink India | భారత్‌లో మారుమూల ప్రాంతాలకూ స్టార్‌లింక్ సేవలందిస్తాం: ఎలాన్‌ మస్క్

భారతదేశంలో శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలను ప్రారంభించేందుకు స్టార్‌లింక్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోన్న తరుణంలో ఆ సంస్థ అధినేత ఎలాన్‌మస్క్ కీలక ప్రకటన చేశారు.

Shivam nagarani

అక్షరటుడే, వెబ్​డెస్క్: Starlink India | భారతదేశంలో శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలను ప్రారంభించేందుకు స్టార్‌లింక్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోన్న తరుణంలో ఆ సంస్థ అధినేత ఎలాన్‌మస్క్ ( Elon Musk )కీలక ప్రకటన చేశారు. భారత్‌లో మారుమూల , ఇంటర్నెట్ సదుపాయం సరిగా అందని ప్రాంతాలకూ తాము సమర్థవంతంగా సేవలను అందించగలమని ఆయన తెలిపారు. సోషల్ మీడియా వేదికగా ఎక్స్ (X) యూజర్ చేసిన పోస్ట్‌కు స్పందిస్తూ మస్క్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

Starlink India | ఇంటర్నెట్ కొరతపై స్పందన..

భారత్‌లో పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ సౌకర్యాలు ఇంకా వెనుకబడి ఉన్నాయని, వేలాది గ్రామాల్లో కనీసం 4జీ కవరేజీ కూడా అందుబాటులో లేదని ఓ యూజర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పోస్ట్‌ను ఉద్దేశించి మస్క్ స్పందిస్తూ.. భారతదేశంలో, ముఖ్యంగా తగినంత ఇంటర్నెట్ కనెక్షన్ లేని మారుమూల గ్రామీణ ప్రాంతాల ప్రజలకు స్టార్‌లింక్ సేవలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని స్పష్టం చేశారు.

Starlink India | కేంద్ర ప్రభుత్వంతో చర్చలు..

మన దేశంలో శాటిలైట్ కమ్యూనికేషన్ సర్వీసులు అందించేందుకు స్టార్‌లింక్ సంస్థ గతంలోనూ దరఖాస్తు చేసుకున్నప్పటికీ, భారత నిబంధనలకు అనుగుణంగా రేడియో ఫ్రీక్వెన్సీలు లేవన్న కారణంతో ఇండియన్‌ నేషనల్‌ స్పేస్‌ ప్రమోషన్‌ అండ్‌ ఆథరైజేషన్‌ సెంటర్ దానిని తిరస్కరించింది. ఈ నేపథ్యంలో, స్టార్‌లింక్ తాజాగా నిబంధనలకు అనుగుణంగా మరోసారి కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం వెలువడింది. ఈ పరిణామాల మధ్య మస్క్ చేసిన తాజా వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Starlink India | సాంకేతికత ప్రత్యేకతలు..

ఎలాన్‌మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ అనుబంధ సంస్థ అయిన స్టార్‌లింక్.. సాంప్రదాయ జియోస్టేషనరీ శాటిలైట్ల పద్ధతికి భిన్నంగా లో ఎర్త్ ఆర్బిట్ (LEO) ఉపగ్రహాల ద్వారా సేవలను అందిస్తోంది. భూమికి కేవలం 550 కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమించే వేలాది ఉపగ్రహాల సహాయంతో ఇది పనిచేస్తుంది. భూమికి తక్కువ దూరంలో ఉండటం వల్ల తక్కువ లేటెన్సీతో (ఆలస్యం లేకుండా) అతివేగవంతమైనఇంటర్నెట్‌ను అందించడానికి వీలవుతుంది. ముఖ్యంగా కొండ ప్రాంతాలు, అటవీ ప్రాంతాలు , కనెక్షన్ లభించని మారుమూల గ్రామాలకు ఈ సాంకేతికత చక్కటి పరిష్కారంగా నిలుస్తుంది.

ఇది కూడా చదవండి: Rahul Gandhi Protest | పోలీస్​ స్టేషన్​ ఎదుట రాహుల్​ గాంధీ ధర్నా

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *