అక్షరటుడే, వెబ్‌డెస్క్: Oppo K14 Plus | చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ అయిన ఒప్పో.. భారత్‌లో మరో మిడ్ రేంజ్ ఫోన్‌ను లాంచ్ చేసింది. అధునాతన ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 17 ఆపరేటింగ్ సిస్టంతో పనిచేసే ఈ ఫోన్లో భారీ బ్యాటరీని అమర్చారు. మూడు వేరియంట్లలో తీసుకువచ్చిన ఈ ఫోన్ ఫస్ట్ సేల్ అక్టోబర్ 8 న ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్ (Flipkart)తో పాటు ఒప్పో ఇండియా అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇలా ఉన్నాయి.
డిస్ప్లే : 6.7 ఇంచ్ 1.5కే అమోలెడ్ డిస్ప్లే అమర్చారు. ఇది 144 హెడ్జ్ రిఫ్రెష్ రేట్, 2712 1220 పిక్సల్స్ రిజల్యూషన్ కలిగి ఉంది.
ఐపీ69 డస్ట్, వాటర్ రెసిస్టెంట్ రేటింగ్ ఉంది.
సాఫ్ట్వేర్ : మీడియాటెక్ డైమెన్సిటీ 7360 మ్యాక్స్ ప్రాసెసర్‌తో వచ్చిన ఈ ఫోన్.. ఆండ్రాయిడ్ 17 ఆపరేటింగ్ సిస్టం ఆధారిత కలర్ ఓఎస్ 16.5 తో పనిచేస్తుంది.
Oppo K14 Plus | కెమెరా సెటప్..
వెనకవైపు 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరాతో పాటు 8 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్‌తో కూడిన డ్యుయల్ కెమెరా సెట్ అప్ ఉంది. ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగా పిక్సెల్ కెమెరా ఇచ్చారు.
Oppo K14 Plus | బ్యాటరీ సామర్థ్యం..
8000 ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు. ఇది 45 డబ్ల్యూ సూపర్ ఊక్ ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఆరేళ్లపాటు వినియోగించిన తర్వాత కూడా బ్యాటరీ 80 శాతం సామర్థ్యంతో పనిచేస్తుందని కంపెనీ చెబుతోంది.
Oppo K14 Plus | మూడు వేరియంట్లలో..
ఆరంజ్, వైట్ కలర్స్‌లో మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.
6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 29,999.
8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 32,999.
8 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 35,999.
ఫస్ట్ సేల్ లో భాగంగా ఈ స్మార్ట్ ఫోన్ పై రూ. 4 వేల డిస్కౌంట్ తో పాటు 6 నెలల నో కాస్ట్ ఈఎంఐని కూడా కంపెనీ ఆఫర్ చేస్తోంది.
ఇది కూడా చదవండి..: Adroit Industries IPO | అదరగొట్టిన అడ్రాయిట్ ఇండస్ట్రీస్ ఐపీవో.. తొలిరోజే 85 శాతం లాభాలు