Adroit Industries IPO | అదరగొట్టిన అడ్రాయిట్ ఇండస్ట్రీస్ ఐపీవో.. తొలిరోజే 85 శాతం లాభాలు

దేశీయ స్టాక్ మార్కెట్‌లో బుధవారం ఎంట్రీ ఇచ్చిన అడ్రాయిట్ ఇండస్ట్రీస్ కంపెనీ.. ఇన్వెస్టర్లపై కాసుల వర్షం కురిపించింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Adroit Industries IPO | డ్రైవ్ లైన్ సిస్టమ్స్ లో వినియోగించే ప్రొపెల్లర్ షాఫ్ట్స్, టార్క్ ట్రాన్స్ మిషన్ కాంపోనెంట్స్ తయారు చేయడంతో పాటు సరఫరా చేసే కంపెనీ అయిన అడ్రాయిట్ ఇండస్ట్రీస్ ఇండియా లిమిటెడ్ కంపెనీ.. మార్కెట్ నుంచి రూ. 150.71 కోట్లు సమీకరించడం కోసం పబ్లిక్ ఇష్యూకు వచ్చింది. ఈ కంపెనీ ఐపీవో సెప్టెంబర్ 23 నుంచి 25 వరకు అందుబాటులో ఉంది. కంపెనీ షేర్లు బుధవారం స్టాక్ మార్కెట్‌లో లిస్టయ్యాయి.

Adroit Industries IPO | భారీ స్పందన..

చిన్న ఐపీవో (IPO) కావడంతో ఇన్వెస్టర్లనుంచి భారీ స్పందన లభించింది. మొత్తం కోటా 176.85 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయ్యింది. ఇందులో క్యూఐబీలు 195.04 రెట్లు, ఎన్ ఐఐలు 332.35 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్లు 99.81 రెట్లు సబ్‌స్క్రైబ్ చేసుకున్నారు.

Adroit Industries IPO | జీఎంపీకి డబుల్ లిస్టింగ్..

అడ్రాయిట్ ఇండస్ట్రీస్ కంపెనీకి గ్రేమార్కెట్‌లో మంచి డిమాండ్ కనిపించింది. ఐపీవో వివరాలు వెల్లడయ్యాక రోజురోజుకు జీఎంపీ పెరుగుతూ వచ్చింది. బుధవారం జీఎంపీ 41 శాతం ఉంది. అయితే జీఎంపీకి దాదాపు రెట్టింపు ధరలో కంపెనీ షేర్లు లిస్టవడం గమనార్హం.

Adroit Industries IPO | లిస్టింగ్‌లోనే 75 శాతం లాభాలు..

కంపెనీ ఒక్కో ఈక్విటీ షేరు ధరను గరిష్ట ప్రైస్ బ్యాండ్ వద్ద రూ. 134 గా నిర్ణయించింది. అయితే 75.37 శాతం ప్రీమియంతో రూ. 235 బుధవారం స్టాక్ మార్కెట్‌లో లిస్టయ్యింది. అనంతరం మరో పది శాతం పెరిగి రూ. 248.39 వద్ద అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. అంటే ఐపీవో అలాట్ అయినవారికి లిస్టింగ్ డే రోజునే 85 శాతం లాభాలు వచ్చాయన్న మాట.

ఇది కూడా చదవండి..: Market Volatility | ఒడిదుడుకుల్లో మార్కెట్లు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *