Stock Market Closing | హమ్మయ్య.. ఊపిరి పీల్చుకున్న ఇన్వెస్టర్లు.. స్వల్ప లాభాలతో ముగిసిన సూచీలు

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market Closing | దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) రోజంతా ఒడిదుడుకుల మధ్య సాగి చివరికి స్వల్ప లాభాలతో ముగిసింది. బుధవారం నష్టాలతో ప్రారంభమై భారీ నష్టాల దిశగా సాగినా.. కనిష్టాల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో తొలి అరగంటలోనే పుంజుకుంది. ఉదయం సెన్సెక్స్ 120 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 305 పాయింట్లు పడిపోయింది.

కనిష్టాల వద్ద లభించిన కొనుగోళ్ల మద్దతుతో తేరుకుని 1,057 పాయింట్లు ఎగబాకింది. నిఫ్టీ 17 పాయింట్ల స్వల్ప నష్టంతో ప్రారంభమై మరో 100 పాయింట్లు తగ్గింది. అక్కడి నుంచి 320 పాయింట్లు పెరిగింది. చివరికి సెన్సెక్స్ 49 పాయింట్ల లాభంతో 74,608 వద్ద, నిఫ్టీ 33 పాయింట్ల నష్టంతో 23,412 వద్ద స్థిరపడ్డాయి. ఐటీ, ఆటో రంగాల షేర్లు ప్రధాన సూచీలను వెనక్కి లాగగా.. మెటల్, టెలికాం, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల షేర్ల మద్దతుతో మార్కెట్లు కోలుకున్నాయి.

Stock Market Closing | మెటల్ స్టాక్స్ లో దూకుడు..

నిఫ్టీ (Nifty) మెటల్ ఇండెక్స్ 3.18 శాతం, టెలికాం 2.79 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్స్ 2.43 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 1.28 శాతం, క్యాపిటల్ గూడ్స్ 1.12 శాతం పెరగ్గా.. ఐటీ 1.13 శాతం, ఆటో ఇండెక్స్ 0.87 శాతం, యుటిలిటీ 0.27 శాతం, రియాలిటీ 0.19 శాతం, బ్యాంక్ నిఫ్టీ 0.18 శాతం నష్టపోయాయి.

Stock Market Closing | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..

బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 2,407 కంపెనీలు లాభపడగా 1,793 స్టాక్స్ నష్టపోయాయి. 169 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 90 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 45 కంపెనీలు 56 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. బీఎస్ ఈలో నమోదైన కంపెనీల సంపద విలువ రూ. 2 లక్షల కోట్ల మేర పెరిగింది.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 13 స్టాక్ లాభపడగా.. 17 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. ఆసియన్ పెయింట్ 4.48 శాతం, టాటా స్టీల్ 3.63 శాతం, బీఈఎల్ 2.93 శాతం, అదానీపోర్ట్స్ 2.79 శాతం, ఎయిర్‌టెల్ 1.78 శాతం లాభపడ్డాయి.

Top Losers : ఎం అండ్ ఎం 2.07 శాతం, పవర్‌గ్రిడ్ 1.52 శాతం, ఇన్ఫోసిస్ 1.51 శాతం, టీసీఎస్ 1.21 శాతం, సన్‌ఫార్మా 1.16 శాతం నష్టపోయాయి.

ఇది కూడా చదవండి..: Stock Market Today | ఒడిదుడుకుల్లో మార్కెట్లు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *