Stock Market Today | ఒడిదుడుకుల్లో మార్కెట్లు

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: cStock Market Today | దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) బుధవారం నష్టాలతో ప్రారంభమై భారీ నష్టాల దిశగా సాగింది. కనిష్టాల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో తొలి అరగంటలోనే పుంజుకుంది.

ఉదయం సెన్సెక్స్ 120 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 305 పాయింట్లు పడిపోయింది. కనిష్టాల వద్ద లభించిన కొనుగోళ్ల మద్దతుతో తేరుకుని 847 పాయింట్లు ఎగబాకింది. నిఫ్టీ 17 పాయింట్ల స్వల్ప నష్టంతో ప్రారంభమై మరో 100 పాయింట్లు తగ్గింది. అక్కడి నుంచి 241 పాయింట్లు పెరిగింది. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 29 పాయింట్ల నష్టంతో 74,530 వద్ద, నిఫ్టీ 19 పాయింట్ల లాభంతో 23,398 వద్ద ఉన్నాయి.

Stock Market Today | మిక్స్‌డ్ గా ఇండెక్స్‌లు..

నిఫ్టీ (Nifty) మెటల్ ఇండెక్స్ 2.55 శాతం, టెలికాం 2.10 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్స్ 1.34 శాతం, క్యాపిటల్ గూడ్స్ 0.73 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 0.57 శాతం, ఎనర్జీ 0.57 శాతం లాభాలతో ఉండగా.. ఆటో ఇండెక్స్ 0.89 శాతం, యుటిలిటీ 0.73 శాతం, పవర్ 0.62 శాతం, ఐటీ 0.45 శాతం, మీడియా 0.32 శాతం నష్టాలతో కదలాడుతున్నాయి.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 13 స్టాక్స్ లాభాలతో, 17 స్టాక్ట్ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. ఆసియన్ పెయింట్ 4.33 శాతం, టాటా స్టీల్ 2.24 శాతం, BEL 1.79 శాతం, అదానీపోర్ట్స్ 1.55 శాతం, ఎయిర్‌టెల్ 1.51 శాతం లాభాలతో ఉన్నాయి.

Top Losers : పవర్‌గ్రిడ్ 3.22 శాతం, ఎం అండ్ ఎం 1.52 శాతం, ఎన్టీపీసీ 1.26 శాతం, మారుతి 0.98 శాతం, టెక్ మహీంద్రా 0.65 శాతం నష్టంతో ఉన్నాయి.

ఇది కూడా చదవండి..: Gold Price Hike | భారీగా పెరిగిన బంగారం ధరలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *