అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hexagon Nutrition IPO | హెక్సాగన్ న్యూట్రిషన్ లిమిటెడ్ భారతదేశంలోని ప్రముఖ పోషకాహార సంస్థలలో ఒకటి. 1993లో స్థాపించబడిన ఈ సంస్థ 3 విభాగాలలో అభివృద్ధి, తయారీపై దృష్టి పెడుతుంది. అవి మైక్రోన్యూట్రియెంట్ ప్రీమిక్స్ ఉత్పత్తులు, క్లినికల్ న్యూట్రిషన్ , థెరప్యూటిక్ ఫుడ్స్. నాసిక్, చెన్నై, తూత్తుకుడిలలో తయారీ కేంద్రాలను, ఉజ్బెకిస్తాన్‌లో ఒక అంతర్జాతీయ కేంద్రాన్ని నిర్వహిస్తోంది.
Hexagon Nutrition IPO | 75 దేశాలకు ఎగుమతులు..
హెక్సాగన్ న్యూట్రిషన్ తన ఉత్పత్తులను రిటైల్ మెడికల్ స్టోర్లు/ఫార్మసీలు, ఆసుపత్రులు, ఇ-కామర్స్ వెబ్సైట్లు, ఆన్లైన్ మెడిసిన్ ప్లాట్‌ఫారమ్‌లు వంటి బహుళ మార్గాల ద్వారా, పెంటాష్యూర్, ఒబెసిగో, పెడియాగోల్డ్ , న్యూట్రోన్ వంటి సొంత వెబ్సైట్ల ద్వారా విక్రయిస్తోంది. ఈ కంపెనీకి భారతదేశంలో 342 పంపిణీదారులు ఉన్నారు. ఆసియా, ఆఫ్రికా, యూరప్ , దక్షిణ అమెరికాలోని 75 కంటే ఎక్కువ దేశాలకు తన ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది.
Hexagon Nutrition IPO | రూ. 138.87 కోట్లు సమీకరించడం కోసం..
కంపెనీ రూ. 1 ఫేస్ వ్యాల్యూ కలిగిన 3,08,59,704 షేర్లను విక్రయించడం ద్వారా మొత్తం రూ. 138.87 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ రూపంలో జరగనుంది. పబ్లిక్ ఇష్యూ ద్వారా కంపెనీ ఎలాంటి ఆదాయాన్ని పొందలేదు. ఎవరైతే ఈ ఐపీవో (IPO) ద్వారా తమ షేర్లను విక్రయిస్తారో వారే ఆదాయం పొందుతారు.
Hexagon Nutrition IPO | ప్రైస్ బ్యాండ్
కంపెనీ ఒక్కో ఈక్విటీ షేరు ధరను రూ. 42 నుంచి రూ. 45 లుగా నిర్ణయించింది. ఒక లాట్లో 333 షేర్లున్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం ఒక లాట్ కోసం గరిష్ట ప్రైస్‌బ్యాండ్ వద్ద రూ. 14,985తో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. గరిష్టంగా 13 లాట్ల వరకు బిడ్ వేయవచ్చు.
Hexagon Nutrition IPO | కోటా, జీఎంపీ..
క్యూఐబీలకి 50 శాతం, రిటైల్ ఇన్వెస్టర్లకు 35 శాతం, ఎనఐఐలకు 15 శాతం వాటాని కంపెనీ కేటాయించింది. హెక్సాగాన్ న్యూట్రిషన్ లిమిటెడ్ ఐపీవోకు సంబంధించిన గ్రే మార్కెట్ ప్రీమియంపై ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం లేదు.
Hexagon Nutrition IPO | ముఖ్యమైన తేదీలు..
ఐపీవో సబ్స్క్రిప్షన్ ఈనెల 5 న ప్రారంభమవుతుంది. 9 వరకు అందుబాటులో ఉంటుంది. 10న షేర్ల అలాట్మెంట్ స్టేటస్ వెల్లడవుతుంది. 12న కంపెనీ షేర్లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్టవుతాయి.
ఇది కూడా చదవండి..: June 01 Market Analysis | లాభాల్లో గ్లోబల్ మార్కెట్లు.. ఫ్లాట్ ఓపెనింగ్ ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ


