అక్షరటుడే, వెబ్‌డెస్క్: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ రియల్‌మీ.. నార్జో సిరీస్‌లో మరో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. నార్జో 100 లైట్ 5జీ మోడల్‌ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. భారీ బ్యాటరీతో బడ్జెట్ ధరలో తీసుకువచ్చిన ఈ ఫోన్ అమెజాన్, రియల్‌మీ వెబ్‌సైట్లలో అందుబాటులో ఉండనుంది. ఏప్రిల్ 21 నుంచి అమ్మకాలు ప్రారంభం అవుతాయి. ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ చూసేద్దామా..
Realme Narzo 100 Lite | డిస్‌ప్లే..
రియల్‌మీ నార్జో 100 లైట్ 6.8 అంగుళాల ఎల్‌సీడీ స్క్రీన్‌తో వస్తోంది. 144 రిఫ్రెష్ రేట్, 900 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో డిస్‌ప్లే పనిచేస్తుంది. ఐపీ64 రేటింగ్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ సర్టిఫికెట్ కలిగి ఉంది.
Realme Narzo 100 Lite | ప్రాసెసర్..
- మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ అమర్చారు. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత రియల్‌మీ యూఐ 7.0 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.
- రియల్‌మీ ఎయిర్‌ఫ్లో వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ ఉంది.
Realme Narzo 100 Lite | కెమెరా సెటప్..
ఇందులో 13 ఎంపీ ప్రధాన కెమెరాతో కూడిన డ్యుయల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5 ఎంపీ కెమెరా ఉంది.
బ్యాటరీ సామర్థ్యం..
- ఇందులోని 7000 ఎంఏహెచ్ బ్యాటరీ.. 15డబ్ల్యూ వైర్డ్ చార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. రివర్స్‌డ్ వైర్డ్ చార్జింగ్, బైపాస్ చార్జింగ్ సదుపాయాలూ ఉన్నాయి.
- సింగిల్ చార్జ్‌తో 10 గంటల పాటు వీడియోలు ప్లే చేయొచ్చని, 70 గంటలపాటు మ్యూజిక్ వినొచ్చని కంపెనీ చెబుతోంది. 34 గంటల కాలింగ్, 12 గంటల గేమింగ్‌ను సపోర్ట్ చేస్తుందంటున్నారు.
వేరియంట్స్..
- ఫ్రాస్ట్ సిల్వర్, థండర్ బ్లాక్ కలర్స్‌లో మూడు వేరియంట్లలో లభిస్తుంది.
- 4జీబీ, 64జీబీ వేరియంట్ ధర రూ.13,499.
- 4జీబీ, 128జీబీ వేరియంట్ ధర రూ.14,499.
- 6జీబీ, 128జీబీ వేరియంట్ ధర రూ.16,499.

