Vivo T5 Pro 5G | శక్తిమంతమైన ప్రాసెసర్‌తో వీవో నుంచి మరో ఫోన్

admin

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Vivo T5 Pro 5G | చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ల తయారీ కంపెనీ అయిన వీవో మిడ్ రేంజ్‌లో మరో మోడల్‌ను మార్కెట్‌లోకి తెచ్చింది. టి5 ప్రో పేరుతో భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఇది టి5 సిరీస్‌లో వచ్చిన రెండో ఫోన్. భారీ బ్యాటరీ, అధునాతన కెమెరా సిస్టమ్ , శక్తిమంతమైన ప్రాసెసర్‌తో మిడ్ రేంజ్ సెగ్మెంట్‌లో తీసుకువచ్చిన ఈ ఫోన్.. ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా ఆన్‌లైన్ స్టోర్ లలో అందుబాటులో ఉండనుంది. ఏప్రిల్ 21 మధ్యాహ్నం 12 గంటలకు సేల్ ప్రారంభమవుతుంది. స్నాప్ డ్రాగన్ 7ఎస్ జెన్ 4 ప్రాసెసర్‌తో వస్తున్న ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ తెలుసుకుందామా..

Vivo T5 Pro 5G | డిస్‌ప్లే..

  • 6.83 ఇంచ్ 1.5కే అమోలెడ్ డిస్‌ప్లే ఇచ్చారు. ఇది 144 హెడ్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్‌డీఆర్ 10 ప్లస్, 1260 2800 పిక్సల్స్ రిజల్యూషన్, ఐపీ68/ఐపీ69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ సర్టిఫికెట్ కలిగి ఉంది.
  • స్లీప్ కంఫర్ట్ మోడ్, యాంటీ మోషన్ సిక్నెస్ మోడ్ కూడా ఉన్నాయి. ఎస్‌జీఎస్ లో బ్లూ లైట్, లో ఫ్లికర్ సర్టిఫికేషన్లు ఉన్నాయి.
  • ఈ ఫోన్ మందం 8.25 మిల్లీమీటర్లు. బరువు సుమారు 213 గ్రాములు.

Vivo T5 Pro 5G | సాఫ్ట్‌వేర్..

క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7ఎస్ జెన్ 4 ప్రాసెసర్ అమర్చారు. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆరిజిన్ ఓఎస్ 6 ఆపరేటింగ్ సిస్టంతో పనిచేస్తుంది. అంటుటు బెంచ్‌మార్క్‌లో 11,80,000 పాయింట్లు సాధించింది.

Vivo T5 Pro 5G | కెమెరా సెటప్..

వెనకవైపు 50 మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 882 మెయిన్ కెమెరాతో పాటు 2 మెగా పిక్సెల్ బొకే కెమెరాతో కూడిన డ్యుయల్ కెమెరా సెట్ అప్ ఉంది. ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా అమర్చారు. రెండు కెమెరాలు 4కే వీడియో రికార్డింగ్‌ను సపోర్ట్ చేస్తాయి.

బ్యాటరీ సామర్థ్యం..

9020 ఎంఏహెచ్ సిలికాన్ కార్బన్ బ్యాటరీ అమర్చారు. ఇది 90 వాట్ ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.

వేరియంట్స్..

  • కాస్మిక్ బ్లాక్, గ్లేసియర్ బ్లూ రంగుల్లో మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉండనుంది.
  • 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 29,999.
  • 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 33,999.
  • 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 39,999.

కార్డ్ ఆఫర్లు..

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎస్‌బీఐ, యాక్సిస్ బ్యాంక్ కార్డులతో కొనుగోలు చేస్తే రూ. 3,000 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభించనుంది.

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *