Samsung Galaxy F70 Pro | మిడ్ రేంజ్‌లో శాంసంగ్ నుంచి మరో ఫోన్..

శాంసంగ్ మిడ్ రేంజ్‌లో మరో మోడల్ ఫోన్‌ను విడుదల చేసింది. ఆగస్టు 8వ తేదీనుంచి సేల్ ప్రారంభం కానుంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Samsung Galaxy F70 Pro | దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ల తయారీ కంపెనీ శాంసంగ్ మిడ్ రేంజ్‌లో మరో మోడల్ ఫోన్‌ను తీసుకువచ్చింది. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 70 ప్రో పేరుతో తీసుకువచ్చిన ఈ మోడల్‌ను సోమవారం భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఈనెల 8వ తేదీనుంచి సేల్ ప్రారంభం కానుంది. సంస్థ వెబ్‌సైట్ తో పాటు ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart)లో అందుబాటులో ఉండనుంది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇలా ఉన్నాయి.

డిస్‌ప్లే : 6.7 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఇన్ఫినిటీ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేతో వచ్చిన ఈ ఫోన్..
120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్, 1080 x 2340 పిక్సల్స్ రిజల్యూషన్ కలిగి ఉంది.
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ప్రొటెక్షన్ ఇస్తుంది. ఐపీ64 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ సర్టిఫికెట్ ఉంది.

Samsung Galaxy F70 Pro | ప్రాసెసర్..

స్నాప్ డ్రాగన్ 6 జెన్ 3 ప్రాసెసర్ అమర్చారు. ఇది ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా పనిచేస్తుంది. ఆరేళ్ల పాటు సెక్యూరిటీ, సాఫ్ట్ వేర్ అప్ డేట్స్ అందించనున్నట్లు కంపెనీ తెలిపింది.

Samsung Galaxy F70 Pro | కెమెరా సెటప్..

వెనకవైపు 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరాతో పాటు 5 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్, 2 మెగా పిక్సెల్ మ్యాక్రో సెన్సార్‌తో కూడిన ట్రిపుల్ కెమెరా సెట్ అప్ ఇచ్చారు. ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.

Samsung Galaxy F70 Pro | బ్యాటరీ సామర్థ్యం..

6000 ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఒక్కసారి ఫుల్ చార్జి చేస్తే 24 గంటలపాటు యÖట్యూబ్ చూడవచ్చని, 12 గంటల పాటు సోషల్ మీడియా స్క్రోల్ చేయవచ్చని కంపెనీ చెబుతోంది.

వేరియంట్స్ : ఆరా గ్రీన్, ఆల్ఫా బ్లాక్ కలర్స్‌లో మÖడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.
6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 23,999.
8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 27,999.
8 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 32,999.
ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్, ఫ్లిప్‌కార్ట్ ఎస్బీఐ క్రెడిట్ కార్డులతో చేసే కొనుగోళ్లపై రూ. 1,199 వరకు క్యాష్ బ్యాక్ వర్తించనుంది.

ఇది కూడా చదవండి..: Stock Market Today | దిగివస్తున్న క్రూడ్ ఆయిల్ ధరలు.. భారీ లాభాల్లో దేశీయ మార్కెట్లు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *