అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Market Today | పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయ ఆందోళనలు తగ్గుముఖం పట్టడంతో క్రూడ్ ఆయిల్ ధర దిగివస్తోంది. దీంతోపాటు దేశీయ స్టాక్ మార్కెట్లో విదేశీ సంస్థాగత మదుపరులు వరుసగా నాలుగు సెషన్లుగా నికర కొనుగోలుదారులుగా నిలవడం, రూపాయి విలువ బలోపేతం అవుతుండడంతో ఇన్వెస్టర్లలో పాజిటివ్ సెంటిమెంట్ బలపడుతోంది. కనిష్టాల వద్ద కొనుగోళ్ల మద్దతు లభిస్తుండడంతో బెంచ్‌మార్క్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీలు పరుగులు తీస్తున్నాయి.
Stock Market Today | భారీ గ్యాప్ అప్‌లో ప్రారంభం..
దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) సోమవారం ఉదయం భారీ లాభాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్ 789 పాయింట్ల లాభంతో ప్రారంభమై మొదట్లో ప్రాఫిట్ బుకింగ్‌తో 386 పాయింట్లు తగ్గినా తిరిగి కోలుకుని 398 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 189 పాయింట్ల లాభంతో ప్రారంభమై 67 పాయింట్లు తగ్గింది. కనిష్టాల వద్ద లభించిన కొనుగోళ్ల మద్దతుతో అక్కడినుంచి 87 పాయింట్లు పైకి ఎగబాకింది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 630 పాయింట్ల లాభంతో 78,724 వద్ద, నిఫ్టీ 209 పాయింట్ల లాభంతో 24,592 వద్ద ఉన్నాయి.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 25 స్టాక్స్ లాభాలతో, 5 స్టాక్స్ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. ఇండిగో 4.08 శాతం, ఇన్ఫోసిస్ 2.68 శాతం, టీసీఎస్ 2.65 శాతం, బజాజ్ పిన్‌సర్వ్ 2.52 శాతం, ఐటీసీ 2.49 శాతం లాభాలతో ఉన్నాయి.
Losers : సన్‌ఫార్మా 1.28 శాతం, ఎయిర్టెల్ 1.06 శాతం, మారుతి 0.48 శాతం, టెక్ మహీంద్రా 0.47 శాతం, ఎన్టీపీసీ 0.14 శాతం నష్టాలతో ఉన్నాయి.
ఇది కూడా చదవండి..: Vida VX2 Go FB | విడా నుంచి మరో ఈవీ స్కూటర్.. తొలి ఫిక్స్డ్ బ్యాటరీ వేరియంట్ ఆవిష్కరణ