Godrej Black Deo | పర్సనల్ కేర్ ఫ్రాగ్రన్స్ విభాగంలోకి ప్రముఖ సంస్థ గోద్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ (GCPL) అడుగుపెట్టింది. అండర్ ఆర్మ్ డియో , యాంటీపెర్స్పిరెంట్ బ్రాండ్ అయిన ‘గోద్రేజ్ బ్లాక్’ను దేశవ్యాప్తంగా విడుదల చేసినట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఈ లాంచ్‌తో పాటు మహారాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉపాధి కల్పించే బృహత్తర కార్యక్రమంలోనూ గోద్రేజ్ భాగస్వామ్యం కుదుర్చుకుంది.
భమ్లా ఫౌండేషన్‌తో కీలక భాగస్వామ్యం..
మహిళా సాధికారత, జీవనోపాధి కల్పన , పర్యావరణ అనుకూల రవాణాను ప్రోత్సహించడమే లక్ష్యంగా మహారాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘పింక్ ఇ-రిక్షా స్కీమ్’కు గోద్రేజ్ మద్దతునిస్తోంది. ఇందులో భాగంగా భమ్లా ఫౌండేషన్‌తో కలిసి మరో 500 మంది మహిళలకు ఇ-రిక్షాల పంపిణీకి ఆర్థిక సహాయం, శిక్షణ, రిజిస్ట్రేషన్ వంటి సేవలను అందిస్తున్నారు. రోజూ కష్టపడే మహిళా డ్రైవర్లు ఎల్లప్పుడూ తాజాగా, ఆత్మవిశ్వాసంతో ఉండేందుకు వారికి ప్రత్యేకంగా ‘బ్లాక్ ఫ్రెష్‌నెస్ కిట్స్’ను అందజేస్తున్నారు.
గోద్రేజ్ బ్లాక్ ప్రత్యేకతలు..
తేలికపాటి లోషన్ రూపంలో ఉండే ఇది, చర్మానికి రక్షణనిస్తూ 48 గంటల పాటు చెమట, దుర్వాసన రాకుండా అడ్డుకుంటుంది. ఇది అన్ని రకాల చర్మ తత్వాలకు సరిగ్గా సరిపోతుంది. కేవలం రూ. 99 ధరతో 40 గ్రాముల ప్యాక్‌లో ఇది లభిస్తుంది. అమెజాన్, బ్లింకిట్, జెప్టో, బిగ్‌బాస్కెట్ వంటి ప్రముఖ ఈ-కామర్స్ , క్విక్-కామర్స్ వేదికల ద్వారా వినియోగదారులకు అందుబాటులో ఉంది.
ఆధునిక జీవనశైలి కోసం..
మారుతున్న వేగవంతమైన జీవనశైలికి తగ్గట్టుగా, రోజంతా చురుగ్గా ఉండాలనుకునే వారి కోసం ‘గోద్రేజ్ బ్లాక్’ను రూపొందించినట్లు జీసీపీఎల్ పర్సనల్ కేర్ మార్కెటింగ్ హెడ్ సమీర్ సూర్యవంశీ తెలిపారు. మహిళలు ఆర్థిక స్వతంత్రత సాధించడంలో ఆత్మవిశ్వాసం కీలకమని, పర్యావరణహిత రవాణాకు తోడ్పడుతున్న మహిళా పారిశ్రామికవేత్తలకు మద్దతునివ్వడం ఎంతో గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.