Congo School Fire | కాంగోలో ఘోర అగ్నిప్రమాదం.. 26 మంది విద్యార్థులు సజీవదహనం

కాంగోలోని బుకావు నగరంలో జరిగిన భారీ అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో 26 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Congo School Fire | కాంగోలోని బుకావు నగరంలో జరిగిన భారీ అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో 26 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన వారిలో 19 మంది బాలికలు, ఏడుగురు బాలురు ఉన్నట్లు స్థానిక అధికారులు ధృవీకరించారు.

బుకావులోని ఒక నివాస గృహంలో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు క్షణాల వ్యవధిలోనే చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరించాయి. వేగంగా ఎగసిపడిన మంటలు పక్కనే ఉన్న రెండు పాఠశాలలకు సైతం అంటుకున్నాయి. ఆ సమయంలో స్కూల్స్‌లో విద్యార్థులు ఉండటంతో పెద్దఎత్తున ప్రాణనష్టం సంభవించింది. ఈ దుర్ఘటనలో 26 మంది విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో పదుల సంఖ్యలో విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.

Congo School Fire | సహాయక చర్యలు ..

సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, ప్రమాద తీవ్రత దృష్ట్యా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రమాదానికి అసలు కారణం ఏంటి, మంటలు అంత వేగంగా పాఠశాలలకు ఎలా వ్యాపించాయనే కోణంలో అధికారులు సమగ్ర దర్యాప్తు జరుపుతున్నారు.


ఇది కూడా చదవండి:  Five Day Banking | ఐదు రోజుల బ్యాంకింగ్​ విధానాన్ని వెంటనే అమలు చేయాలి

 

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *