Krishna Water | మొద్దు నిద్రలో కాంగ్రెస్​ ప్రభుత్వం : మాజీ మంత్రి శ్రీనివాస్​ గౌడ్​

నాగర్‌కర్నూల్ జిల్లా గుడిపల్లి రిజర్వాయర్ వద్ద కల్వకుర్తి ఎత్తిపోతల పథకం స్టేజ్-3 పంప్‌హౌస్‌ను బీఆర్​ఎస్​ నేతలు పరిశీలించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Krishna Water | నాగర్‌కర్నూల్ జిల్లా (Nagarkurnool District) గుడిపల్లి రిజర్వాయర్ వద్ద మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం (KLIS) స్టేజ్-3 పంప్‌హౌస్‌ను మాజీ మంత్రులు వి శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, సి లక్ష్మారెడ్డి శుక్రవారం పరిశీలించారు. పంపులు ఆన్​ చేసి రైతులకు సాగు నీరు ఇవ్వాలని డిమాండ్​ చేశారు.

మాజీమంత్రి శ్రీనివాస్​ గౌడ్​ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందన్నారు. నీళ్లు పోతున్నా మోటార్లు ఆన్ చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు రిజర్వాయర్లు పూర్తయినా నింపడం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు శ్రీశైలం నుంచి 37 టీఎంసీల నీరు వెళ్లినట్లు అధికారికంగా చెబుతున్నారు. కానీ వాస్తవంగా వెళ్లింది 70 టీఎంసీలని ఆయన ఆరోపించారు. తెలంగాణకు మాత్రం 7 టీఎంసీల లోపే నీరు వచ్చిందన్నారు.

Krishna Water | రెండు మోటార్లే నడుస్తున్నాయి

ఎల్లూరులో ఐదు మోటార్లు నడవాల్సి ఉండగా రెండు మాత్రమే నడుస్తున్నాయని శ్రీనివాస్​గౌడ్​ అన్నారు. గుడిపల్లి వద్ద ఐదు మోటార్లు ఉంటే ఒకటి, రెండు మాత్రమే నడుస్తున్నాయి. రాత్రి సమయంలో కాకుండా కేవలం పగటి పూట మాత్రమే మోటార్లు నడుపుతున్నారని పేర్కొన్నారు. కృష్ణా బేసిన్‌లో ఉన్న వారికి నీరు లేదని, కానీ ఆంధ్రప్రదేశ్‌లోని పెన్నా బేసిన్‌లో ఉన్న పొలాలకు కృష్ణా నీటిని తరలిస్తున్నారని విమర్శించారు. వరద జలాల కోసం నిర్మించిన వెలిగొండ ప్రాజెక్టు ద్వారా 8 వేల క్యూసెక్కుల నికర జలాలు పోతున్నా తెలంగాణ ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడ్డారు.

ఇది కూడా చదవండి..: Sridhar Babu Comments | త్వరలో టైర్-2 నగరాలకు ఐటీ విస్తరణ : మంత్రి శ్రీధర్ బాబు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *