KTR on Congress | కాంగ్రెస్ అడ్డదారిలో అధికారంలోకి వచ్చింది.. కేటీఆర్

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్: KTR on Congress | కాంగ్రెస్ అడ్డదారిలో అధికారంలోకి వచ్చిందని బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. 2014, 2018లో ఒంటరిగా పోటీచేసి తాము గెలిచామన్నారు. 2023లోనూ ఒంటరిగా పోటీచేసి చిన్న తేడాతో ఓడిపోయామని తెలిపారు.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్​ (Telangana Bhavan)లో కేటీఆర్​ జెండా ఆవిష్కరించారు. అంతకుముందు పార్టీ కార్యాలయ ఆవరణలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి, అమరులకు నివాళులు అర్పించారు. తెలంగాణ భవన్‌లో పలువురు తెలంగాణ కళాకారులకు సన్మానం చేసి, కేసీఆర్​పై, తెలంగాణపై రూపొందించిన పలు పాటలను కేటీఆర్​ ఆవిష్​కరించారు.

KTR on Congress | మళ్లీ కేసీఆర్​ వస్తారు

KTR on Congress

రాష్ట్రంలో 2028లో మళ్లీ కేసీఆరే (KCR) సీఎం అవుతారని కేటీఆర్​ అన్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ తెలంగాణను మళ్లీ 25 ఏళ్లు వెనక్కి నెట్టే పరిస్థితి తెచ్చిందని విమర్శించారు. గ్యారెంటీలతో గద్దెనెక్కి వడ్డించిన విస్తరి లాంటి రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షేమంలో ఉన్న తెలంగాణ కాంగ్రెస్​ పాలనలో సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు.

KTR on Congress | విజయానికి ప్రతీక

KTR on Congress

జూన్ 2 తెలంగాణ ఆత్మగౌరవానికి, త్యాగానికి, చారిత్రక విజయానికి ప్రతీక అని కేటీఆర్​ అన్నారు. అసమానతలు, అవమానాలు, అణచివేత నుండి తెలంగాణ ప్రజలు విముక్తి పొందిన రోజు అని పేర్కొన్నారు. పోరాటాలు, త్యాగాల ద్వారా రాష్ట్ర సాధనను విజయవంతంగా పూర్తి చేసుకున్న అనంతరం, కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రగతి ప్రస్థానం చారిత్రక ఆరంభాన్ని సూచించే రోజు జూన్ 2 అని తెలిపారు.

ఇది కూడా చదవండి..:Telangana Financial Crisis | రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై బండి సంజయ్​ సంచలన వ్యాఖ్యలు

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *