Bandi Bhagirath Case | పరారీలో బండి సంజయ్​ కుమారుడు

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bandi Bhagirath Case | కేంద్ర మంత్రి బండి సంజయ్​ కుమారుడు భగీరథ్​ పరారీలో ఉన్నట్లు సిట్​ అధికారి రితిరాజ్ (DCP Rithiraj)​ తెలిపారు. అతడిపై నమోదైన పోక్స్​ కేసు విచారణకు ప్రభుత్వం ఆమెను ప్రత్యేకాధికారిగా నియమించిన విషయం తెలిసిందే.

బండి భగీరథ్​పై పేట్​బషీరాబాద్​ పోలీస్​ స్టేషన్​లో పోక్సో కేసు (POCSO Case) నమోదు అయిన విషయం తెలిసిందే. సోమవారం సాయంత్రం కూకట్​పల్లి డీసీపీ రితిరాజ్​ ఠాణాకు వచ్చారు. SHO క్యాబిన్‌లో ఆమె మీటింగ్​ నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

Bandi Bhagirath Case | చర్యలు తీసుకుంటాం

బండి భగీరథ్ పరారీలో ఉన్నాడని రితిరాజ్​ తెలిపారు. మూడు రోజులుగా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందన్నారు. అతని CDR పరిశీలిస్తుస్తున్నామని, ఆచూకీ కోసం గాలిస్తున్నామన్నారు. ఇప్పటికే బాధితురాలి స్టేట్​మెంట్​ రికార్డు చేశామన్నారు. అవసరం అయితే మరోసారి ఆమెతో మాట్లాడుతామని చెప్పారు. నిందితుడిని పట్టుకున్న తర్వాత చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. బాధితురాలికి న్యాయం చేస్తామన్నారు.

దీనిని కూడా చదవండి : Telangana Women Commission | తెలంగాణ మహిళా కమిషన్‌ ఏర్పాటు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *