అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Telangana Women Commission | రాష్ట్ర ప్రభుత్వ తెలంగాణ మహిళా కమిషన్‌ను నియమించింది. కమిషన్ ఛైర్‌పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మి (Gadwal Vijayalakshmi)ని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు (CS Ramakrishna Rao) ఉత్తర్వులు జారీ చేశారు.
ఛైర్‌పర్సన్‌తో సహా ఏడుగురు సభ్యులతో కమిషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ సభ్యులు ఐదేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. కమిషన్ సభ్యులుగా కాసోజు శంకరమ్మ, చిట్యాల శ్వేత, శశికళ యాదవ్ రెడ్డి, సదా లక్ష్మి, రాధాబాయి, షకీరా నియమితులయ్యారు.
Telangana Women Commission | సభ్యుల నేపథ్యం..
సీనియర్ నాయకుడు కే కేశవరావు కుమార్తె, హైదరాబాద్ మాజీ మేయర్ గద్వాల విజయలక్ష్మిని ప్రభుత్వం మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా నియమించడం గమనార్హం. ఆమె బీఆర్ఎస్ హయాంలో మేయర్‌గా ఎన్నికయ్యారు. అనంతరం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన శ్రీకాంతాచారి తల్లి కాసోజు శంకరమ్మకు ప్రభుత్వం సభ్యురాలిగా అవకాశం కల్పించింది. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ ముని మనవరాలు చిట్యాల శ్వేతకు సైతం అవకాశం ఇచ్చింది. తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం అవకాశం కల్పించడం గమనార్హం. సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని సభ్యులను నియమించింది.
The Government of Telangana has issued https://t.co/AIz7y9zxYp. 637 dated 11.05.2026 appointing the Chairperson and Members to the Telangana Women’s Commission under the Telangana Women’s Commission Act, 1998.
Appointments:
Smt. Gadwal Vijay Laxmi — Chairperson
Smt. Kasoju… pic.twitter.com/x50vQcIAdW— IPRDepartment (@IPRTelangana) May 11, 2026
దీనిని కూడా చదవండి : Rashmi Gautam | బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు.. రష్మీ సంచలన పోస్టు

