Rashmi Gautam | బండి సంజయ్​ కుమారుడిపై పోక్సో కేసు.. రష్మీ సంచలన పోస్టు

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rashmi Gautam | కేంద్ర మంత్రి బండి సంజయ్​ (Bandi Sanjay) కుమారుడు భగీరథ్​ సాయిపై పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో యాంకర్​ రష్మీ గౌతమి సంచలన పోస్టు చేశారు.

రష్మీ బీజేపీకి అనుకూలంగా పోస్టులు పెడుతుంటారు. ఈ క్రమంలో సాయి భగీరథ్​పై పోక్సో (POCSO Case) విషయంలో పలువురు ఆమెను ట్యాగ్​ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. ఈ వ్యవహారంపై ఎందుకు స్పందించడం లేదని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఆమె ఎక్స్​ వేదికగా స్పందించారు. ‘‘నేను బీజేపీ (BJP)కి మద్దతు ఇస్తాను కానీ.. రేపిస్టులకు, లైంగిక వేధింపులకు పాల్పడేవారికి కాదని” ఆమె పేర్కొన్నారు. తాను సమస్యలపై కేవలం సానుభూతి చూపగలనని, పోరాడేంత శక్తి తనకు లేదని పేర్కొన్నారు.

Rashmi Gautam | వారిని ట్యాగ్​ చేయండి

తనను ట్యాగ్ చేసి దూషించడంతో ప్రయోజనం ఉండదని.. తనని టార్గెట్ చేస్తున్న వారికి రష్మీ బదులు ఇచ్చారు. తనని ట్యాగ్ చేసే బదులు ప్రభుత్వ అధికారులు, న్యాయవ్యవస్థను ట్యాగ్ చేసి న్యాయం కోరమని సూచించారు.ఈ ఘటనపై పోస్టు పెట్టినంత మాత్రాన ఎలాంటి మార్పు రాదని, తనను ట్యాగ్ చేయొద్దని కోరారు. నటీనటులను ట్యాగ్ చేయడం ఫ్యాషన్‌గా మారిందని.. కానీ దాని వల్ల ప్రయోజనం ఏమీ ఉండదన్నారు.

Rashmi Gautam | బీఆర్​ఎస్​ నిరసనలు

బండి సంజయ్​ కుమారుడిపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్​ చేస్తున్నారు. ముఖ్యంగా బీఆర్​ఎస్​ నాయకులు (BRS Leaders) ఈ వ్యవహారంలో బీజేపీతో పాటు కాంగ్రెస్​ను టార్గెట్​ చేస్తున్నారు. రెండు పార్టీల మధ్య రహస్య ఒప్పందం ఉండటంతో భగీరథ్​పై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్​ నాయకులు మౌనంగా ఉంటున్నారు. ఈ వ్యవహారంపై పరేడ్​ గ్రౌండ్స్​లో జరిగిన సభలో సంజయ్​ స్పందించారు. తనపై కొందరు కుట్ర పన్నారని ఆరోపించారు.

ఇది కూడా చదవండి..: BRS Party Meeting | 12న ఎర్రవెల్లి నివాసంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన సమావేశం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *