Nampally Railway Station | నాంపల్లి రైల్వే స్టేషన్​లో అగ్ని ప్రమాదం

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nampally Railway Station | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలోని నాంపల్లి రైల్వే స్టేషన్​లో శుక్రవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం (Fire accident) చోటు చేసుకుంది. స్టేషన్​లో నిలిపి ఉంచిన రైలులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

నాంపల్లి నుంచి జైపూర్‌ వెళ్తున్న ఎక్స్​ప్రెస్​ రైలులో మంటలు అంటుకున్నాయి. నాలుగో ప్లాట్​ఫామ్​పై ఉన్న రైలు ఏసీ బోగీ (AC Coach)లో మంటలు వ్యాపించాయి. ఏసీ కోచ్ B2, B3 బోగీల్లో చెలరేగిన మంటలు అంటుకున్నాయి. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. మూడు ఫైర్ ఇంజన్లతో మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. ఆ సమయంలో బోగీల్లో ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది.

Nampally Railway Station | ప్రయాణికుల ఆందోళన

రైలు నుంచి పొగ దట్టంగా వ్యాపించడంతో, ప్రయాణికులు, స్థానికులలో భయాందోళనకు గురయ్యారు. అసలు ఏం జరుగుతుందోనని కాసేపు షాక్​ అయ్యారు. నిమిషాల వ్యవధిలోనే మంటలు వ్యాపించడంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. రైల్వే అధికారులు విచారణ చేస్తున్నారు.

దీనిని కూడా చదవండి : Indiramma Houses | వారికి కూడా ఇందిరమ్మ ఇళ్లు.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *