Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
Subscribe
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Top Categories
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • ఆంధ్రప్రదేశ్​
    • సినిమా
  • జిల్లాలు
    • హైదరాబాద్
    • నిజామాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • మహబూబ్‌నగర్
  • Pages
    • Home
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms and Conditions
Follow US

Home - తెలంగాణ

తెలంగాణ

Gadal Srinivasa Rao | తెలంగాణ జనసేనలోకి చేరిన మాజీ హెల్త్ డైరెక్టర్ గడల.. ఆహ్వానించిన పవన్ కల్యాణ్

Shivam nagarani
Last updated: June 3, 2026, 6:07 pm 6:07 pm
Shivam nagarani
Share
Gadal Srinivasa Rao

అక్షరటుడే వెబ్‌డెస్క్: Gadal Srinivasa Rao | తెలంగాణ రాజకీయాల్లో ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మాజీ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాసరావు జనసేన పార్టీలో చేరారు. బుధవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ( Pawan Kalyan ) నివాసంలో ఈ కార్యక్రమం జరిగింది. గడల శ్రీనివాసరావుకు పవన్ కల్యాణ్ స్వయంగా పార్టీ కండువా కప్పి జనసేనలోకి సాదరంగా ఆహ్వానించారు. తెలంగాణలో జనసేన పార్టీ మళ్లీ యాక్టివ్ కాబోతోందని, వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తుందని పవన్ కల్యాణ్ నిన్ననే ప్రకటించగా.. మరుసటి రోజే ఈ కీలక చేరిక జరగడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Gadal Srinivasa Rao | గడల రాక పార్టీకి అదనపు బలం..

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. గడల శ్రీనివాసరావు కుటుంబంతో తమకు ఎప్పటి నుంచో మంచి అనుబంధం ఉందన్నారు. ఒక నిజాయతీ గల, ప్రజాసేవ పట్ల అంకితభావం ఉన్న అధికారిగా శ్రీనివాసరావుకు సమాజంలో మంచి గుర్తింపు ఉందని కొనియాడారు. ఆయనలాంటి పరిపాలనా అనుభవం, సేవాభావం ఉన్న వ్యక్తులు జనసేనలో చేరడం పార్టీకి అదనపు బలాన్ని, విశ్వసనీయతను ఇస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణలో పార్టీ విస్తరణకు, బలోపేతానికి ఆయన అనుభవం ఎంతో ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
gadala

 

Gadal Srinivasa Rao | సమాజానికి విస్తృతంగా సేవ చేయాలనే ఉద్దేశంతో..

గడల శ్రీనివాసరావు మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవి ద్వారానే పవన్ కల్యాణ్‌తో తనకు పరిచయం ఏర్పడిందని గుర్తు చేసుకున్నారు. తాను జనసేనలో చేరడం అనేది ఏదో ఆవేశంలోనో, భావోద్వేగంతోనో తీసుకున్న నిర్ణయం కాదని.. సమాజానికి మరింత విస్తృతంగా సేవ చేయాలనే ఉద్దేశంతో ఆలోచించి తీసుకున్న నిర్ణయమని స్పష్టం చేశారు. నేటి తరానికి పవన్ కల్యాణ్ లాంటి విలువలున్న నాయకత్వం అవసరమని, ఇకపై ఒక జనసైనికుడిగా తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ప్రకటించారు.

gadala.1

Gadal Srinivasa Rao | బీఆర్ఎస్‌లో దక్కని చాన్స్..

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కరోనా సమయంలో హెల్త్ డైరెక్టర్‌గా పనిచేసిన గడల శ్రీనివాసరావు రాష్ట్రవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తన స్వంత ‘జీఎస్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ద్వారా ఉచిత వైద్య శిబిరాలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పొలిటికల్ ఎంట్రీకి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడెం నుండి బీఆర్ఎస్ టికెట్ ఆశించినప్పటికీ ఆయనకు నిరాశే ఎదురైంది. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో ఆయన తన ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ (VRS) చేశారు.

కొంతకాలం సైలెంట్‌గా ఉన్న గడల.. ఇప్పుడు అనూహ్యంగా జనసేన కండువా కప్పుకున్నారు. కొత్తగూడెం నియోజకవర్గంలో ఆంధ్రా మూలాలున్న ఓటర్లతో పాటు, పవన్ కల్యాణ్ అభిమానులు, యువత ఎక్కువగా ఉండటంతో.. తన రాజకీయ భవిష్యత్తుకు జనసేన కరెక్ట్ వేదిక అవుతుందనే లెక్కలతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. తెలంగాణలో జనసేనను బలోపేతం చేస్తామంటున్న పవన్ కల్యాణ్‌కు, గడల శ్రీనివాసరావు రాక ఏ మేరకు కలిసివస్తుందో వేచి చూడాలి.

ఇది కూడా చదవండి: Dalit Tribal Journalists | దళిత, గిరిజన జర్నలిస్టుల రక్షణే లక్ష్యం : కాదేపురం గంగన్న

TAGGED:andhra politicsGadal Srinivasa RaoJana Sena PartyKothagudem Newslatest newsPawan KalyanPolitical JoiningTelangana NewsTelangana Politicstelugu news
ByShivam nagarani
Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Previous Article DK Shivakumar DK Shivakumar Swearing In | కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం
Next Article Harishrao Birthday Harishrao Birthday | ఆర్​కే ఫౌండేషన్​ ఆధ్వర్యంలో ఘనంగా హరీశ్​రావు జన్మదిన వేడుకలు
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

Employee Health Scheme
తెలంగాణ

Employee Health Scheme | ప్రత్యేక ట్రస్ట్ ద్వారా ఈహెచ్​ఎస్​​ అమలు

By Srinivas Kolluri
Saraswati Antya Pushkaralu
భక్తితెలంగాణ

Saraswati Antya Pushkaralu | ఈనెల 21 నుంచి సరస్వతీ నదీ అంత్య పుష్కరాలు

By Naresh Chandan
Inter Board Merger
బ్లాగ్తెలంగాణ

Inter Board Merger | ఇంటర్​ బోర్డు విలీనం ప్రతిపాదన.. విద్యా సంస్కరణా..? లేక విద్యా వ్యవస్థపై ప్రయోగమా..?

By Balla Sandeep Kumar
TRS Flag Festival
తెలంగాణ

TRS Flag Festival | మే 20 నుంచి టీఆర్​ఎస్​ జెండా పండుగలు : కవిత

By Balla Sandeep Kumar
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.