DK Shivakumar Swearing In | కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: DK Shivakumar Swearing In | కర్ణాటక రాజకీయాల్లో మునుపెన్నడూ లేని ఒక సరికొత్త మార్పు చోటుచేసుకుంది. రాష్ట్రంలో గత కొంతకాలంగా కొనసాగుతున్న అధికార మార్పిడి సస్పెన్స్‌కు తెరదించుతూ.. కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్( DK Shivakumar ) కర్ణాటక 18వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. బెంగళూరులోని లోక్ భవన్‌లో అత్యంత వైభవంగా జరిగిన ఈ వేడుకలో గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ ఆయన చేత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు.

dk.2 1

DK Shivakumar Swearing In | 13 మంది మంత్రుల ప్రమాణం..

ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేరళ నేత వీడీ సతీషన్‌తో పాటు పలువురు విఐపీలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సీఎం డీకే శివకుమార్‌తో పాటు మరో 13 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర సిద్ధరామయ్యకు కూడా మంత్రివర్గంలో చోటు దక్కడం విశేషం.

dk.1 1

DK Shivakumar Swearing In | ఒప్పందంలో భాగంగానే..

మే 2023లో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చినప్పుడు సీఎం పీఠం కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య గట్టి పోటీ నడిచింది. ఆ సమయంలో కాంగ్రెస్ అధిష్టానం ఇద్దరి మధ్య ఒక ‘పవర్ షేరింగ్’ (అధికార భాగస్వామ్య) ఒప్పందాన్ని కుదిర్చింది. ఐదేళ్ల కాలపరిమితిలో ఇద్దరూ చెరిసగం రోజులు ముఖ్యమంత్రిగా ఉండాలనేది ఆ ఫార్ములా సారాంశం. ఇందులో భాగంగానే మొదటి విడత పూర్తి చేసుకున్న సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేయగా, ఆయన స్థానంలో ఇప్పుడు డీకే శివకుమార్ కర్ణాటక సీఎం పీఠాన్ని అధిరోహించారు.

ఇది కూడా చదవండి: GGH Plastic Surgery | నిజామాబాద్​ జీజీహెచ్​లో తొలి ప్లాస్టిక్ సర్జరీ విజయవంతం

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *