అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: GGH Plastic Surgery | నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో తొలి ప్లాస్టిక్ సర్జరీ శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించినట్లు సూపరింటెండెంట్ నాగమోహన్ తెలిపారు.
గాంధారి మండలానికి (Gandhari Mandal) చెందిన లచ్చవ్వ (45) అనే రోగికి ముఖం ఎడమ చెంప భాగంలో వ్యాధి నిర్ధారణ కావడంతో, ప్లాస్టిక్ సర్జన్ డా. శివాని ఆధ్వర్యంలో రోటేషన్ ఫ్లాప్ రీ కన్స్ట్రక్షన్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ ఆపరేషన్ హెచ్వోడీ విజయ్ కుమార్ పర్యవేక్షణలో జరిగింది. శస్త్రచికిత్స అనంతరం రోగి కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు.
GGH Plastic Surgery | మరో మహిళకు..
నిజామాబాద్ (Nizamabad)కు చెందిన మమత అనే మహిళకు కాలి భాగంలో దీర్ఘకాలంగా మానని గాయం ఉంది. జీజీహెచ్లో ప్లాస్టిక్ సర్జరీ విభాగం ఆధ్వర్యంలో ఆమెకు శస్త్రచికిత్స నిర్వహించారు. ప్లాస్టిక్ సర్జన్ శివాని రోగికి ఫ్లాప్ కవర్, స్ప్లిట్ తిక్నెస్ స్కిన్ గ్రాఫ్టింగ్ శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించారు. ఈ శస్త్రచికిత్స విభాగాధిపతి విజయ్ కుమార్ పర్యవేక్షణలో జరిగింది. ఈ చికిత్స ద్వారా రోగి కాలును సంరక్షించడంతో పాటు, సాధారణ జీవన విధానానికి తిరిగి చేరుకునే అవకాశం కలిగిందని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి..: Gram Sabha Meetings | గ్రామ, వార్డు సభలను సమర్ధవంతంగా నిర్వహించాలి
