Tamil Nadu Explosion | టపాసుల పరిశ్రమలో పేలుడు.. 18 మంది మృతి

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tamil Nadu Explosion | తమిళనాడులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. టపాసుల తయారీ పరిశ్రమలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 18 మంది మృతి చెందారు.

తమిళనాడులోని విరుదునగర్‌ (Virudhunagar)లోని కట్టనార్‌పట్టి ప్రాంతంలో ఆదివారం బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 18 మంది చనిపోగా.. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అధికారులు, అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మంటలను ఆర్పి వేశారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. పేలుడు ధాటికి భవనంలోని కొంతభాగం కూలిపోయింది. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

factory

Tamil Nadu Explosion | సీఎం సంతాపం

ప్రమాదంపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ (CM Stalin)​ స్పందించారు. విరుదునగర్ జిల్లా, కట్టనార్‌పట్టిలోని బాణసంచా కర్మాగారంలో జరిగిన పేలుడులో పలువురు ప్రాణాలు కోల్పోయిన విషాద వార్త తీవ్ర దుఃఖాన్ని కలిగిస్తోందన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని అధికారులకు సూచించారు.

Tamil Nadu Explosion | రాష్ట్రపతి దిగ్భ్రాంతి

తమిళనాడులోని బాణసంచా కర్మాగారంలో జరిగిన ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Murmu) విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కాగా తమిళనాడు మంత్రులు కె. కె. ఎస్. ఎస్. ఆర్. రామచంద్రన్, తంగం తెన్నరసులను వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలను పర్యవేక్షించారు.

దీనిని కూడా చదవండి : Hyderabad Rains | హైదరాబాద్​లో వర్షం.. పలుచోట్ల వడగళ్ల వాన..

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *