Nizamabad Husband Murder | భర్త నరాల్లోకి టాయిలెట్​ క్లీనర్​ ఎక్కించి హత్య.. వివాహేతర బంధానికి అడ్డొస్తున్నాడని భార్య ఘాతుకం

ముందుగా అతనికి మద్యం అధికంగా తాగించి, అనంతరం ఇంటి పైకప్పు నుంచి కిందికి తోసివేసినట్లు విచారణలో వెల్లడైంది.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Nizamabad Husband Murder | ఒకప్పుడు నమ్మకం, ప్రేమ, పరస్పర గౌరవానికి ప్రతీకగా నిలిచిన దాంపత్య బంధాలు.. ఇప్పుడు అనుమానాలు, విభేదాలు, వివాహేతర సంబంధాల కారణంగా దారుణ మలుపులు తిరుగుతున్న ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి.

కుటుంబాన్ని కాపాడాల్సిన బంధాలే ప్రాణాలు తీసే స్థాయికి చేరడం సమాజాన్ని కలచివేస్తోంది. నిజామాబాద్ జిల్లాలో వెలుగుచూసిన తాజా ఘటన అలాంటి విషాద పరిణామానికే నిదర్శనంగా నిలిచింది.

Telangana Telugu History | ఆంధ్రుల భాష ‘ఆంధ్రం’… మనది ‘జాన తెలుగు’!: “ఇడుపు కాయితం” Title లొల్లి వేళ ఆకట్టుకుంటున్న ప్రొఫెసర్ దంటు కనకదుర్గ విశ్లేషణ

Nizamabad Husband Murder | బతుకుదెరువు కోసం భర్త ఎడారి దేశంలో చమటోడ్చుతుంటే..

జిల్లాలోని మోపాల్ మండలం న్యాలకల్ గ్రామానికి చెందిన ప్రశాంత్ కుటుంబ పోషణ కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లాడు. ఈ సమయంలో అతని భార్య సంధ్యకు బంటి అనే యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడినట్లు పోలీసులు వెల్లడించారు.

కొంతకాలం తర్వాత ప్రశాంత్ స్వగ్రామానికి తిరిగి రావడంతో ఈ విషయం అతనికి తెలిసిందని, అప్పటి నుంచి భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.

Nizamabad Husband Murder : ఇంటి పైకప్పు నుంచి కిందికి తోసేసి

ఈ నేపథ్యంలో గత నెల 30న సంధ్య తన ప్రియుడు బంటితో కలిసి ప్రశాంత్‌ను హత్య చేయాలని పథకం రచించినట్లు పోలీసులు తెలిపారు. ముందుగా అతనికి మద్యం అధికంగా తాగించి, అనంతరం ఇంటి పైకప్పు నుంచి కిందికి తోసివేసినట్లు విచారణలో వెల్లడైంది. తీవ్రంగా గాయపడిన ప్రశాంత్‌ను కుటుంబ సభ్యులు ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

అయితే, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో కూడా కుట్ర కొనసాగిందని పోలీసులు చెబుతున్నారు. సంధ్య, ఆమె ప్రియుడు కలిసి సిరంజ్ సహాయంతో టాయిలెట్ క్లీనర్‌ను ప్రశాంత్ నరాల్లోకి ఎక్కించి హత్య చేసినట్లు పేర్కొంటున్నారు.

కాగా, మద్యం మత్తులో ఇంటి పైకప్పు నుంచి పడిపోవడంతోనే మృతి చెందినట్లు అందరినీ నమ్మించే ప్రయత్నం చేసినట్లు విచారణలో వెల్లడైంది.

Nizamabad Husband Murder : పోస్టుమార్టం నివేదికలో అనుమానాస్పద అంశాలు

అయితే పోస్టుమార్టం నివేదికలో అనుమానాస్పద అంశాలు బయటపడటంతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. విచారణలో సంధ్య అసలు విషయాన్ని ఒప్పుకొన్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో సంధ్యతో పాటు ఆమె ప్రియుడు బంటిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఈ ఘటన మరోసారి దాంపత్య బంధాల్లో విశ్వాసం, పరస్పర అవగాహన, బాధ్యత ఎంత ముఖ్యమో గుర్తుచేస్తోంది. వ్యక్తిగత విభేదాలు, వివాహేతర సంబంధాలు చట్టవిరుద్ధమైన, అమానుషమైన నేరాలకు దారితీస్తే.. దాని మూల్యం కుటుంబాలతోపాటు సమాజమంతా చెల్లించాల్సి వస్తుందని ఈ ఘటన స్పష్టం చేస్తోంది.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *